Monday, April 29, 2024

ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు బెంగుళూరులో ‘మెటల్‌ ఫార్మింగ్‌ ఎగ్జిబిషన్‌’

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఇండియన్‌ మెషిన్‌ టూల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఐఎంటీఎంఏ) ఆధ్వర్యంలో మెటల్‌ ఫార్మింగ్‌ ఎగ్జిబిషన్‌ ఎనిమిదో ఎడిషన్‌ బెంగుళూరు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ (బీఐఈసీ)లో ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్‌ రాజేంద్ర ఎస్‌ రాజమనే తెలిపారు. మెటల్‌ ఫార్మింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీలపై ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నా మని పేర్కొన్నారు. టూల్‌టెక్‌ 2024 మెషిన్‌ టూల్‌ యాక్సెసరీస్‌, ఫార్మింగ్‌ టూల్స్‌, డై అండ్‌ మోల్డ్‌, మెట్రాలజీ, సీఏడీ/సీఏఎం, డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌లో సంకలిత తయారీ, పరిశ్రమలో సరికొత్త ఆవిష్కరణలను కలిగి ఉందన్నారు. 4.0, వెల్డ్‌ ఎక్స్ఫో, వెల్డింగ్‌, కటింగ్‌, అసోసియేషన్‌తో అనుబంధం కోసం ఈ ప్రదర్శన అన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వెల్డింగ్‌ ఏకకా లంలో నిర్వహించబడుతుందన్నారు. మోల్డెక్స్‌ ఇండియా, ఫాస్టెనెక్స్‌ ఇండియా, మెస్సే స్టట్‌గార్ట్‌ ద్వారా నిర్వహించబడు తున్నాయని తెలిపారు. వరుసగా మౌల్డింగ్‌, ఫాస్టెనర్‌లు, ఫిక్సింగ్‌ టెక్నాలజీలపై దృష్టి సారించి, ఐఎంటీఈఎక్స్‌ ఫార్మింగ్‌ 2024తో పాటు ఉంటాయన్నారు. ఐఎంటీఈఎక్స్‌ ఫార్మింగ్‌ 2024లో దాదాపు 45 వేల చదరపు మీటర్ల ఎగ్జిబిషన్‌ స్థలంలో 18 దేశాల నుంచి దాదాపు 500 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారన్నారు. ఇది ఐదు ఎగ్జిబిషన్‌ హాళ్లను కవర్‌ చేస్తుందన్నారు. ఎగ్జిబిటర్లు మెటల్‌ ఫార్మింగ్‌, మెటల్‌ ఫార్మింగ్‌ టెక్నాలజీస్‌, రోబోటిక్స్‌, ఆటోమేషన్‌, వెల్డింగ్‌, జాయినింగ్‌, వైర్‌-ఫార్మింగ్‌, డ్రాయింగ్‌, ప్రెస్‌లు, డై కాస్టింగ్‌, హైడ్రోఫార్మింగ్‌, షీట్‌ మెటల్‌ ఫార్మింగ్‌ మెషీన్‌లు, ప్రత్యేక అప్లికేషన్‌ల కోసం ప్రెస్‌లు, డై అండ్‌ మోల్డ్‌లో సరికొత్త సాంకేతికతలను ప్రదర్శిస్తారని తెలిపారు. హైడ్రాలిక్‌, న్యూమా టిక్‌ సిస్టమ్స్‌, ఎలిమెంట్స్‌, టెస్టింగ్‌ మెషీన్లు మొదలైనవి ప్రదర్శ నలో ఉంటాయని పేర్కొన్నారు. ఐఎంటీఎంఏ ఫార్మింగ్‌ 2024 దేశంలోని సానుకూల వ్యాపార వాతావరణాన్ని ఉపయోగించు కోవడానికి తయారీ పరిశ్రమలకు గొప్ప అవకాశాలను అందిస్తుందని తెలిపారు. ఇకగకడికి వచ్చే చాలా మంది సందర్శ కులు పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాధికా రులను కలిగి ఉంటారన్నారు. ఈ సందర్భంగా ఐఎంటీఎంఏ డైరెక్టర్‌ జనరల్‌, సీఈవో జిబాక్‌ దాస్‌గుప్తా మాట్లాడుతూ మెటల్‌ ఫార్మింగ్‌ సెక్టార్‌లోని కంపెనీల ఆర్థిక దృక్పథం ఆశాజనకంగా ఉందన్నారు. ఐఎంటీఈఎక్స్‌ ఫార్మింగ్‌ ఈ వాగ్దానాన్ని సాకారం చేయడంలో ఉత్ప్రేరక పాత్ర పోషిస్తుందన్నారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించడానికి, ఎగ్జిబిటర్‌లు, సందర్శకులకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే తాజా ఆఫర్‌లు, ఉత్పత్తులు, పరిష్కారాల కోసం పరిశ్రమలకు ఇది గొప్ప అవకాశం అన్నారు. మరింత సమాచారం కోసం, షషష.ఱఎ్‌వఞ.ఱఅకు లాగిన్‌

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు