Monday, April 29, 2024

శాం పిట్రోడా రాసిన రీడిజైన్‌ ద వరల్డ్‌ పుస్తకాన్నితెలుగులో ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క

తప్పక చదవండి
  • కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి ఎం.ఎం. పళ్లం రాజు
  • ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి’’ ప్రపంచానికి పిలుపు

హైదరాబాద్‌ : ‘రీడిజైన్‌ ద వరల్డ్‌’ పుస్తకం తెలుగు అనువాదాన్ని బంజారా హిల్స్‌లొని హోటల్‌ తాజ్‌ కృష్ణలో గల సెఫైర్‌ బాంక్వెట్‌ హాల్‌ లో ఆవిష్కరించారు.శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా, డాక్టర్‌ డి. చంద్రశేఖర్‌ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు. శాం పిట్రోడా ఈ కార్యక్రమంలో జూం కాల్‌ ద్వారా పాల్గొన్నారు. ముఖ్య అతిథులలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి శ్రి ఎం.ఎం. పళ్ళం రాజు ఉన్నారు. గౌరవ అతిథులుగా మాజీ ఎం.పి. మధు యాష్కీ గౌడ్‌, పరకాల ప్రభాకర్‌, మాజీ ఎం.పి. వుండవల్లి అరుణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మదన్‌ మొహన్‌ ఋఆవు, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు, ఐపీఎస్‌ వి.వి. లక్ష్మీనారాయణ, ఐపీఎస్‌ ఎన్‌. సాంబశివ రావు, ఐఏఎస్‌ కె.ఎన్‌.కుమార్‌ పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ సందర్భంగా క్వాడ్‌ జెన్‌ వైర్‌ లెస్‌ సొల్యుషన్స్‌ చైర్మన్‌ సీఎస్‌ రావు మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇలాంటి ఉన్నత నాయకులు, మేధావులతో వేదికను పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నాను. ‘రీడిజైన్‌ ది వరల్డ్‌’ పుస్తకానికి ఈ తెలుగు అనువాదం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ప్రపంచ నిర్మాణం గురించి, భారతదేశ ఎదుగుదలపై దాని ప్రభావం గురించి రాసిన ఈ తెలుగు అనువాదాన్ని నిజమైన ఆందోళన లను చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలు మనమంతా చదవడానికి అర్హమై నది’’ అన్నారు. తనకు తెలుగు అనువాద హక్కులు ఇచ్చినందుకు శామ్‌ పిట్రోడాకు సి.ఎస్‌.రావు కృత జ్ఞతలు తెలియజేశారు. శ్రీ విజయ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎమెస్కో అనే అత్యంత ప్రజాదరణ పొం దిన, చరిత్రాత్మకంగా స్థాపించిన తెలుగు ప్రచురణ సంస్థకు కూడా తన కృతజ్ఞతలు తెలియజేశారు.
‘‘రీడిజైన్‌ ది వరల్డ్‌’’ పుస్తకంపై శాం పిట్రోడా ఓవర్‌ వ్యూ.. ‘‘రీడిజైన్‌ ది వరల్డ్‌’’ మరియు ‘‘ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి’’ అనే ఈ పుస్తకం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మూల కారణాలను పూర్తిగా స్పష్టంగా గుర్తించడం ద్వారా ప్రపంచసమస్యల గురించి చాలా తెలివైన వివరణ. బాగా గుర్తించిన ప్రపంచ సమస్యలకు ఆచరణాత్మకమైన, ఆచరణీయమైన పరిష్కారంగా స్పష్టమైన మేనిఫెస్టోను శాం ఈ పుస్తకం ద్వారా సూచించారు. మొబైల్‌ వాలెట్లు, పేమెంట్స్‌, బ్యాంకింగ్‌ ఆఫర్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ లు మన సమాజం, నాగరికతల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి ప్రపంచశక్తుల ప్రభావం, ఔచిత్యం ఇప్పుడు ఎలా ఉంటాయని, అమెరికా, రష్యా, యుకె, నాటో, చైనా తదితర సూపర్‌ పవర్స్‌ ఇంకా ఎందుకని శాం పిట్రోడా ప్రశ్నిస్తు న్నారు. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి నిర్మాణాత్మక మార్పు, జనాభా, డిజిటల్‌ డివిడెండ్‌ సామర్ధ్యంతో ప్రపంచ క్రమంలో భారతదేశం ప్రాముఖ్యత ప్రపంచ పునర్నిర్మాణ ఆవశ్యకత భావనగా హైలైట్‌ అవు తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులైన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు ఎంఎం పళ్లంరాజు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఇంకా మధుయాష్కీ గౌడ్‌ లకు సిఎస్‌ రావు, శామ్‌ పిట్రోడా కృతజ్ఞతలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు