Tuesday, May 7, 2024

భారత దేశ అభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎనలేనిది

తప్పక చదవండి

ప్రవాస భారతీయులు మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ వున్నారు. మాతృ గడ్డ మీధ మమ కారం చూపెడుతూ వున్నారు.తాము డాలర్లుగా సంపాదించిన వాటిని కోట్లలో మార్చి మన దేశంలో ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. ప్రవాస భారతీయుల దినోత్సవం భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారాన్ని గుర్తించడానికి భారతదేశపు రిపబ్లిక్‌ ద్వారా జనవరి 9 న ఏటా జరిగే వేడుక రోజు. జనవరి 9, 1915 న దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబై కి తిరిగి వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయుల దినోత్సవము ప్రతీ ఏటా జరుపుకుంటాము.2003 లో స్థాపించబడి, భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ సమాఖ్య భారత పరిశ్రమల సమాఖ్య, నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ యొక్క అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత ఆమోదం పొందింది.2014 లో, ప్రవాస భారతీయుల దినోత్సవము న్యూఢల్లీిలో జరిగింది, 51 దేశాల నుండి 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డులను ఇచ్చారు.2013 లో, 11 వ ప్రవాస భారతీయుల దినోత్సవము 7-9 జనవరి కొచ్చిలో జరిగింది . మారిషస్‌ అధ్యక్షుడు, రాజ్కేశ్వూర్‌ పుర్రీగ్‌ అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవహరించాడు. 12వ ప్రవాస భారతీయుల దినోత్సవము 2014 జనవరి 7-9 న న్యూ ఢల్లీిలోని విజ్ఞాన్‌ భవన్లో జరిగింది. 13వ ప్రవాస భారతీయుల దినోత్సవము గుజరాత్లోని గాంధీనగర్లోని మహాత్మా మందిర్‌ వద్ద జనవరి 7-9, 2015న జరిగింది.14వ ప్రవాస భారతీయుల దినోత్సవము 2016 7-9 జనవరిలో న్యూఢల్లీిలో జరిగింది. 15వ ప్రవాస భారతీయుల దినోత్సవము 2017 7-9 జనవరిలో కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.ప్రాంతీయ ప్రవాస భారతీయుల దినోత్సవము 2018 6-7 జనవరి 6-8 న సింగపూర్‌, మరీనా బే సాండ్స్లో జరిగింది.ప్రతీ ఏటా ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను చేస్తూ వున్నారు.వివిధ దేశాల్లో స్థిర పడ్డ మన భారతీయులు ఆయా గ్రామాల్లో,పట్టణాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తమ మాతృ దేశ అభిమానాన్ని చాటుతూ వున్నారు.ప్రతీ ఏటా ఇండియా నుండి అన్ని దేశాలకు విద్య ఉద్యోగ ,వ్యాపార రీత్యా అనేక మంది భారతీయులు విదేశాలకు వెళుతూ వున్నారు.అగ్ర రాజ్యం అమెరికా కి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువగా ఉంది.వివిధ దేశాల్లో మన వారు పెద్ద వ్యాపార కంపెనీలు పెట్టీ లక్షలాది మందికి ఉపాధి కల్పన చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ వున్నారు. రాజకీయాల్లో కూడా రాణిస్తూ సుపరి పాలన అందిస్తున్నారు.మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా మన పండు గలను పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు జరుపుకుంటూ మన దేశ కీర్తిని ఇనుమడిరప చేస్తున్నారు.మన దేశ ఔన్నత్యానికి పెద్ద పీట వేస్తున్నారు.భారతీయులు అంటే గర్వం గా వుండేలా మన దేశం గొప్ప తనం గూర్చి నలు దిక్కుల చాటు తున్నారు.అందరం ఒక్కటే అనే సమైక్య భావాన్ని చాటుతూ వున్నారు.మన నేతలు కూడా వారికి సముచిత గౌరవం ఇస్తున్నారు.కానీ కొన్ని దేశాల్లో మన భారతీయుల మీద దాడులు జరుగుతూ వున్నాయి. అమెరి కాలో గతంలో కాల్పులు జరపడంతో మన భారతీయులు మరణిం చిన సందర్బాలు అనేకం వున్నాయి. ఆయా దేశాలు కూడా ప్రవాస భారతీయుల కు రక్షణ కల్పించాలి. అనుకొని ప్రమాదంలో ఎవరు అయిన మరణిస్తే వారి పార్థీవ దేహాన్ని అక్కడి ఖర్చులతో ఉచితంగా ఇండియాకి విమానం ద్వార పంపే ఏర్పాట్లు చేయాలి. హైదరాబాద్‌ నుండి నేరుగా ఆయా దేశాలకు ఎక్కడ ఆగకుండా వెళ్లే విధంగా విమాన సదుపాయాన్ని కల్పించాలి.ప్రవాస భారతీయులను గౌరవించడం మన సంప్రదాయం.
` కామిడి సతీష్‌ రెడ్డి 9848445134

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు