Friday, May 3, 2024

సిరిసిల్ల సెస్‌లోనే సుమారు రూ.700 కోట్లకు పైగా నష్టాలు

తప్పక చదవండి
  • ఎన్పీడీసీఎల్‌లో ట్రాన్స్‌ కో, జెన్‌ కోను మించి అక్రమాలు
  • నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగదారుల వద్ద వసూళ్లు
  • సీఎండీ గోపాల్‌ రావు అవినీతి అరాచకాలపై విచారణ జరపాలి
  • ఇతను కూడా కేసీఆర్‌ బంధువే రాజీనామాను ఆమోదించవద్దు

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఉత్తర తెలంగాణలోని వరంగల్‌ కేంద్రంగా ఉన్న నార్తేరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ పి డి సి ఎల్‌) లో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4 విద్యుత్‌ కంపెనీలు ఉండగా అందులో జెన్‌ కో, ట్రాన్స్‌ కో, సి ఎం డి ప్రభాకర్‌ రావు ఎస్పీడీసీఎల్‌ (సౌతెరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌) సిఎండి రఘుమారెడ్డి కాగా (ఎన్పీడీసీఎల్‌) నార్తరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ కు ఏ గోపాలరావు సిఎండిగా వ్యవహరిస్తున్నారు. భారీ అవకతవకలు జరిగినట్లు దీనిపైన విచారణ చేయాల్సిందిగా పలువురు సూచిస్తున్నారు.
సిరిసిల్ల సెస్‌ లోనే సుమారు 700 కోట్లకు పైగా నష్టాలు
సిరిసిల్లలో 1970లో జాతీయ గ్రామీణ విద్యుద్దీకరణ కోఆపరేటివ్‌ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది 74 లో సొంత భవనంలోకి మార్చడంతో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారు. సి ఈ ఎస్‌ ఎస్‌ కో-ఆపరేటివ్‌ ఎలక్ట్రిక్‌ సప్లై సొసైటీ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఎలక్ట్రిసిటీ సప్లై ని చేయడం ప్రారంభించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా లోని సిరిసిల్ల పట్టణంతోపాటు 46 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా సెస్‌ కు ఎన్పీడీసీఎల్‌ ద్వారా అందించారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా అది ఇప్పుడు 230 గ్రామాలకు చెందిన చేనేత కార్మికులకే కాక, వ్యవసాయం పారిశ్రామిక వీధి దీపాలకు కూడా దీని ద్వారా విద్యుత్‌ సరఫరా అందుతుంది. అయితే విద్యుత్‌ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం డబ్బులు కట్టించుకొని విద్యుత్‌ సరఫరా చేయాలి. లేదంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి. కానీ సిఎండి గోపాలరావు సుమారు 700 కోట్ల పైచిలుకు బకాయిలు ఉన్న విద్యుత్‌ సరఫరాను నిలిపివేయకుండా విద్యుత్‌ సంస్థలకు నష్టాలను మిగిల్చాడు. ఇందులో ఏమైనా రూపాయి కారి ఒప్పందాలు ఉన్నాయా అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.
నష్టాలను పూడ్చుకోవడానికి ప్రజలపై భారం
ఈ నష్టాలను పూడ్చుకోవడానికి గృహపయోగదారులపై పెను భారం మోపారు. నిబంధనలకు విరుద్ధంగా గృహవినియోగదారుల దగ్గర డెవలప్మెంట్‌ చార్జీలు అంటూ సర్వీస్‌ ఛార్జిలంటూ ఇంధన చార్జీలంటు ఇష్టానుసారంగా ప్రజల దగ్గర వసూలు చేయడం. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతోంది. చెప్పరాయిస్తూ సొసైటీ ద్వారా వసూలు చేయాల్సింది పోయి ప్రజలపై భారం మోపడం ఏంటని ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ కూడా విద్యుత్‌ సంస్థల నిబంధనలను పాటించకుండా వ్యవరించడంపై పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఇతను కూడా కెసిఆర్‌ బంధువే విచారణ జరపాలంటున్న సిరిసిల్ల ప్రజలు
ఏదేమైనాప్పటికిని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అనుమానిస్తున్న విధంగానే తెలంగాణ విద్యుత్‌ శాఖలో అవినీతి జరిగిందని అనడంలో ఆశ్చర్యం ఏమి లేదు (ఎన్పీడీసీఎల్‌) నార్త్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ సిఎండి అయినా ఏ గోపాలరావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బంధువేనని ఆయనపై విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. విద్యుత్‌ సంస్థలకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నాయంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతుంది విద్యుత్‌ కంపెనీలకు ఉన్న సీఎండీల రాజీనామాలను ఆమోదించకుండా వీటన్నింటి పైన పూర్తిస్థాయి విచారణ జరిపి నిజాలు రాబట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు