Wednesday, May 8, 2024

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో రోజు రోజుకి పెరుగుతున్న మద్యం అమ్మకాలు

తప్పక చదవండి

భోపాల్‌ : మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగాయి. సోమ‌వారం, బుధ‌వారం అధిక స్థాయిలో అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు తెలిసింది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ జరుగుతున్నాయి. న‌వంబ‌ర్ 13వ తేదీన సుమారు 8,67,282 లీట‌ర్ల మ‌ద్యాన్ని అమ్మిన‌ట్లు అధికారులు తెలియజేసారు. ఇందులో విదేశీ లిక్క‌ర్ కూడా ఉన్న‌ట్లు అధికారులు పొందుపరిచారు. ఆ త‌ర్వాత రోజుల్లో 9,17,823 లీట‌ర్లు, 8,81,550 లీట‌ర్ల మ‌ద్యాన్ని అమ్మారని తెలిసింది. అయితే గ‌త ఏడాది న‌వంబ‌ర్ 13, 14,15 రోజుల్లో 7,42,092 లీట‌ర్లు, 7,71,331 లీట‌ర్లు, 7,67,273 లీట‌ర్లు అమ్మగా సాధార‌ణంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తి ఏడాది 10 శాతం మ‌ద్యం అమ్మ‌కాలు పెరుగుతుంటాయ‌ని ఓ అధికారి చెప్పారు. గ‌త ఏడాది లిక్క‌ర్ షాపుల వేలం ద్వారా 11,700 కోట్లు వ‌చ్చాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు