గాజా : గాజాలోని షిఫా హాస్పిటల్ కాంప్లెక్స్‌లో ఉన్న హమాస్ టన్నెల్ వీడియోను ఇజ్రాయిల్ రక్షణ దళాలు రిలీజ్ చేశాయి. టన్నెల్‌కు చెందిన ఎంట్రీ ఉన్న ప్రాంతాన్ని ఐడీఎఫ్ గుర్తించింది. ఎక్స్ అకౌంట్‌లో ఆ వీడియోను, ఫోటోలను రిలీజ్ చేశారు. గాజా సిటీలో ఉన్న షిఫా ఆస్పత్రికి ఈ టన్నెల్‌నే దారిగా హమాస్ వాడుతున్నట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. హాస్పిటల్ కాంప్లెక్స్‌లో ఉన్న బిల్డింగ్‌ల మధ్య ఆ టన్నెల్ ఎంట్రెన్స్ ఉన్నట్లు ఐడీఎఫ్ గుర్తించింది. టన్నెల్‌కు సమీపంలో ఉన్న ఓ ఆయుధాల ట్రక్కును గుర్తించారు. అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడిలో ఆ ఆయుధాలు వాడినట్లు భావిస్తున్నారు.