Thursday, June 13, 2024

సమ్మెకు సిద్ధమవుతున్న పలు బ్యాంకులు..

తప్పక చదవండి
  • డిసెంబరు 4 నుంచి సమ్మె ప్రారంభం
  • 11 న ముగియనున్న సమ్మె
  • బ్యాంకుల్లో శాశ్వత సిబ్బంది నియామకాలు జరపాలని డిమాండ్
  • ఔట్ సోర్సింగ్ సేవలకు స్వస్తి చెప్పాలని అంటున్న బ్యాంకు ఉద్యోగులు

దేశంలోని వివిధ బ్యాంకులు సమ్మెకు సిద్ధం అవుతున్నాయి. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మెజరుగనున్నట్టు తెలిసింది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాంకుల్లో తగినంత మంది శాశ్వత సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలకు స్వస్తి పలకాలన్నది బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ఉద్యోగుల వల్ల బ్యాంకు ఖాతాదారుల కీలక సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా… డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్… డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర… డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు