Monday, April 29, 2024

కలిసి కష్టపడదాం..

తప్పక చదవండి
  • కేసీఆర్‌ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం
  • జరిగిందేదో జరిగింది.. కలిసి కట్టుగా పోరాడుదాం
  • అసంతృప్తికి కారణాలను సమీక్షించుకొని సాగుదాం
  • ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
  • పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాలి
  • తెలంగాణ గళం, బలం బీఆర్‌ఎస్‌ పార్టీదేనన్న కేటీఆర్‌

హైదరాబాద్‌ : ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఖమ్మంతో పాటు ఒకటి.. రెండు జిల్లాల్లో మినహాయించి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమని అన్నారు. 39 ఎమ్మె ల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని, ఇంకా కొన్ని స్థానాల్లో మరికొన్ని కారణాలచేత మన అభ్యర్థులు ఓడిపోయారని అన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని సమీక్షించుకుని ముందుకు సాగుదామని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఖమ్మం సమీక్ష సమావేశం జరుగడం ఇది ఏడోసారన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై 30 రోజులు పూర్తయ్యిందని.. చెప్పుకొచ్చిన కేటీఆర్‌ అధికారంలోకి వచ్చిన తెల్లారినించే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన చేస్తుందని ఆరోపించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్‌ పార్టీ మీద ఒత్తిడితెస్తూ తెలంగాణ ప్రజలకోసం బీఆర్‌ఎస్‌ పార్టీ పోరాడుతుందని కేటీఆర్‌ అన్నారు. పదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత కేవలం తెలంగాణ గళం బీఆర్‌ఎస్‌ పార్టీదేనని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ప్రజల బలం బీఆర్‌ఎస్సే నాని ఆయన స్పష్టం చేశారు. రాబోవు రోజుల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త వేసే ప్రతి అడుగులో కేసీఆర్‌ దళంగా ఐకమత్యంగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుతున్న తీరుకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్దత కలిగిన బీఆర్‌ఎస్‌ నాయకుల, కార్యకర్తల మీద ఉందని కేటీఆర్‌ గుర్తు చేశారు.
నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్పూర్తితో నిన్నటిదాకా సాధించిన ప్రగతి దీప్తిని. తిరిగి నిలబెట్టుకుందామని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని పార్టీని పటిష్టం చేయాలనీ కోరారు. అధికారంలో ఉన్నప్పటి కన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమని కేటీఆర్‌ అన్నారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మా పోరాట పటిమను మీరు చూశారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ అసెంబ్లీ కొస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్ళమే. కేసీఆర్‌ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే ప్రమాదమని కేటీఆర్‌ అన్నారు. సీఎం అనే రెండక్షరాల కన్నా కేసీఆర్‌ అనే మూడు అక్షరాలే పదమే పవర్‌ ఫుల్‌ అని కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -

ఫిబ్రవరిలో కేసీఆర్‌ ప్రజల మధ్యకు..
పార్లమెం టు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ముగియగానే అసెం బ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉం టాయని కేటీఆర్‌ అన్నారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతీ రెండు మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తామని కేటీఆర్‌ అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖమ్మం సీటును కచ్చితంగా గెలవాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు