Thursday, May 16, 2024

ఆదానీ, అంబానీకే సాత్‌ మోడీ

తప్పక చదవండి
  • దేశ ప్రజలను వంఛించిన బీజేపీ..
  • సమాజాన్ని పట్టి పీడిస్తున్న మతతత్వ బీజెపిని గద్దె దించాలి
  • బీఆర్‌ఎస్‌ను తెలంగాణలో బొందపెట్టాలి
  • కూతుర్ని రక్షించేందుకు షా కాళ్లు మొక్కిన కేసీఆర్‌
  • నడవలేని వనమా పార్టీ గుర్తు కొనుక్కున్న జలగం అవసరమా
  • బీఆర్‌ఎస్‌, బీజేపిల పీడ పోవాలంటే కూటమి గెలవాలి
  • సీపీఐ అభ్యర్థి కూనంనేనిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి
  • కొత్తగూడెం బహిరంగసభలో కూటమి నాయకులు

కొత్తగూడెం (ఆదాబ్‌ హైదరాబాద్‌) : సబ్‌ కే సాత్‌, సబ్‌ కే వికాస్‌ అంటూ దేశప్రజలను మోసం చేస్తున్న మోడీ ఆదానీ, అంబానీలకే దేశ సంపదను దోచి పెడుతున్నాడని దేశప్రజలను వంచించిన బీజెపిని గద్దె దించాలని సిపిఐ జాతీయప్రధాన కార్యదర్శి డి.రాజా, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఆంధ్రప్రదేశ్‌ సిపిఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అజీజ్‌పాషా, కాంగ్రెస్‌ రాష్ట్రప్రచార కమిటీ కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రమంత్రి లక్ష్మా, కొత్తగూడెం నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావులు పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం, టీడిపి, తెలంగాణ జనసమితి కొత్తగూడెం నియోజకవర్గ కూటమి అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలుపును కాంక్షిస్తూ కొత్తగూడెం సూపర్‌బజార్‌ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడారు.10 సంవత్సరాలుగా దేశప్రజలను, దేశాన్ని అనేక విధాలుగా మోడీప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతుందని అటువంటి ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.ధరల పెరుగుదలతో ప్రజలు అల్లాడుతున్నా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకున్న పాపానపోలేదన్నారు. ప్రజల సొమ్మును కార్పోరేట్‌ శక్తులకు మోడీ దోచిపెడుతున్నాడని వారి బాగోగులు తప్ప ప్రజల ఇబ్బందులు మోడీకి పట్టవన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని, కెసిఆర్‌ కుటుంబం తప్ప తెలంగాణలో ఏపేదకుటుంబం ఆర్థికంగా ఎదగలేదన్నారు.అటువంటి బీఆర్‌ఎస్‌ పార్టని సైతం తెలంగాణలో బందపె ట్టాలని పిలుపునిచ్చారు.కెసిఆర్‌ కూతురును లిక్కర్‌స్కామ్‌నుంచి తప్పించేందుకు కెసిఆర్‌ అమీత్‌సా కాళ్లు మొక్కాడని అందుకే ఆకేసునుంచి కవితను తప్పించారన్నారు.తెలంగాణ వచ్చాక మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని కెసిఆర్‌, ఆయన కుటుంబం అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని కెసిఆర్‌ అవినీతి అక్రమాల చిట్టాను బయటకు తీస్తామన్నారు. కొత్త గూడెం నియోజకవర్గంలో నడవలేని వనమా వెంకటేశ్వరరావు ఇంకా ప్రజలకు ఏం సేవచేస్తాడని ప్రశ్నించారు.ఆయన కుమారుడి అరాచకాలను మాఫీ చేయించుకునేందుకే తిరిగి సీటు తెచ్చుకొని ఎన్ని కల్లో పోటీ చేస్తున్నాడని అటువంటి నాయకులను గెలిపిస్తే అరాచకమే తప్ప అభివృద్ధి ఉండదన్నారు. పూటకో పార్టీ మారే జలగం వెంకట్రావు తల్లిలాంటి పార్టీ గుర్తును కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేయడం సిగ్గుచేటన్నారు.పార్టీ గుర్తునే కొనుగోలు చేసుకున్న జలగం ఇంకా ప్రజలకు ఏం సేవచేస్తాడని ప్రశ్నించారు. ఇటువంటి నాయకులు అవసరమా అని అన్నారు.కూట మి అభ్యర్థి అయిన కూనంనేని సాంబశివరావును గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని, కాంగ్రెస్‌ప్రభుత్వం ఏర్పడగనే కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి తామందరం సహకరిస్తామని ఈసందర్భంగా నాయ కులు కొ త్తగూడెం ప్రజలకు హా మీ ఇచ్చారు.మిత్రపక్షాల అభ్యర్థి అయిన కూనంనేని సాంబ శివరావు కంకికొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈసభలో కూటమి రాష్ట్ర,జిల్లా నాయకులు దయానంద్‌, ఎస్‌కె.సాబీర్‌పాషా,బాగం హేమంతరావు, నాగా సీతారాములు, కొత్వాల శ్రీనివాస్‌రావు, దేవీప్రసన్న, ఆళ్లమురళీ, తూము వెంకటేశ్వర్లు చౌదరి, శంకర్‌నాయక్‌, యర్రంశెట్టి ముత్తయ్య, జాలే జానకీరెడ్డి, మోతుకూరి ధర్మారావు తదితరులు పాల్గన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు