Saturday, May 4, 2024

కేసీఆర్‌ వందనోటు కాదు.. దొంగనోటు

తప్పక చదవండి
  • కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలకు పదను
  • చిరుమర్తిని గెలిపిస్తే దొరగడీకి చేరిండు
  • కోమటిరెడ్డి బ్రదర్స్‌కు దోఖా ఇచ్చిండు
  • ప్రత్యేక తెలంగాణలోనే కష్టాలు పెరిగాయి
  • నకిరేకల్‌ ప్రచార సభలో ఘాటు విమర్శలు
  • సుడిగాలి పర్యటనలతో రేవంత్‌ దూకుడు

నల్లగొండ : పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేపట్టారు. ఎక్కడికి వెళ్లినా కెసిఆర్‌ అవినీతిని టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్నారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు, హైదరాబాద్‌లో పది వేల ఎకరాలను సీఎం కేసీఆర్‌ దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు రేవంత్‌ నకిరేకల్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ..‘ఎలక్షన్స్‌….కలెక్షన్స్‌… సెలక్షన్స్‌ పేరుతో కేసీఆర్‌ రాష్ట్రాన్ని దోచుకున్నారు. నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్యను నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచి పార్టీ ఫిరాయించి దొర గడీకి చేరిండు. పార్టీ పిరాయించిన 12మందిని అసెంబ్లీ గేటు తాకనివ్వొద్దన్నారు. చిరుమర్తి కోసం కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎంతగానో పాటుపడి గెలిపించారని, అలాంటి వాడు కాంగ్రెస్‌కు దోఖా చేశాడని అన్నారు. కోమటిరెడ్డికి పేరు వస్తుందని ఎస్‌ఎల్బీసీని పక్కన పెట్టారు. కేసీఆర్‌ దొంగనోటు లాంటివాడు. నల్గొండ గడ్డ కాంగ్రెస్‌ అడ్డా.. కేసీఆర్‌ దొంగనోటు లాంటివాడు. 30లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్‌లో రోడ్లపై ఖాళీగా తిరుగుతున్నారు. వేముల వీరేశంను 40వేల మెజారిటీతో గెలిపించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రెండు లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని టిపిసిసి ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. పదేళ్లు పాలించిన సిఎం కెసిఆర్‌ ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదని, ఏళ్లుగా నిరుద్యోగులు హైదరాబాద్‌ రోడ్లపై తిరుగుతున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగాలు రావాలంటే నిరుద్యోగులే కార్యకర్తలు కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు తల్చుకుంటే కాంగ్రెస్‌కు 50 లక్షల మెజార్టీ వస్తుందని జోస్యం చెప్పారు. సిఎం కెసిఆర్‌ను ఓడిస్తే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి పాలన కంటే కెసిఆర్‌ పాలనలో అన్యాయం ఎక్కువ జరిగిందన్నారు. పదేళ్లలో బిఆర్‌ఎస్‌ ఆరు లక్షల కోట్లు అప్పు చేసిందని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ వంద నోటు కాదని దొంగ నోటు అని చురకలంటించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా కూడా బిఆర్‌ఎస్‌ రాదన్నారు. నల్లగొండ గడ్డా కాంగ్రెస్‌ పార్టీ అడ్డా అని ఆయన ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడా చూసినా నల్లగొండ యువకులే కనిపిస్తారన్నారు. తాను, తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, వేముల వీరేశం.. త్రిమూర్తులు మాదిరిగా ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని ఎంపీ, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. అనాడు సోనియాగాంధీని ఎదురించి చిరుమర్తి లింగయ్యకు టికెట్‌ ఇప్పిస్తే.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తి చేయలేదన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు కేసీఆర్‌ వర్సెస్‌ కోమటిరెడ్డి బ్రదర్స్‌, వేముల వీరేశంగా పోల్చారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ లో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజా భరోసా సభలో ఎంపీ, నల్గొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ పార్టీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ప్రజలు స్వాగతించారని అన్నారు. అధికారంలోకి రాగానే కొత్త ఉద్యోగాలను సృష్టించి.. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను పర్మినెంట్‌
చేస్తామని హామీ ఇచ్చారు. నకిరేకల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యను ఎవరూ పట్టించుకోవద్దని చెప్పారు. నకిరేకల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వేముల వీరేశాన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కష్టపడి పని చేయాలని కోరారు. కేసీఆర్‌, మంత్రి జగదీష్‌ రెడ్డి అడ్డుపడ్డా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలేరని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు