Monday, April 29, 2024

తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్‌

తప్పక చదవండి
  • గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సులో మోడీ

గాంధీనగర్‌ : భవిష్యత్తులో ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపారు. బుధవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ’గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సు 2024’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయీద్‌ అల్‌ నహ్యాన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన రాక భారత్‌`యూఏఈ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోడీ అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో స్థిరత్వానికి మూల స్తంభంగా, విశ్వమిత్రగా, సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలిగే సాంకేతిక కేంద్రంగా, ప్రతిభావంతులైన యువత కలిగిన శక్తివంతమైన కేంద్రంగా భారత్‌ను అంతర్జాతీయ సమాజం చూస్తోంది. ఉమ్మడి లక్ష్యాలను నిర్దేశిరచుకుని వాటిని సాధించగలమనే భావనను ప్రపంచ దేశాలకు భారత్‌ కలిగించిందని అన్నారు. ఇటీవలే భారత్‌ 75 ఏళ్ల స్వాతంత్య వేడుకలను చేసుకుంది. రాబోయే 25 ఏళ్లు భారత్‌కు అమృత కాలం. ఈ 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో భారత్‌ మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందనేందుకు నాది భరోసా అని ప్రధాని మోడీ తెలిపారు. భారత చరిత్రలో నరేంద్ర మోడీ అత్యంత విజయవంతమైన ప్రధాని అని రిలయన్స్‌ ఇండస్టీస్ర్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అన్నారు. గుజరాత్‌ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రధాని నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. ‘భారతీయులు ఎక్కువగా ’మోడీ హైతో ముమ్‌కిన్‌ హై’అని ఎందుకు అంటున్నారని విదేశాల్లోని మిత్రులు నన్ను అడుగుతారు. దానికి నేను చెప్పే సమాధానం.. భారత ప్రధాని తన సంకల్పంతో సవాళ్లను అధిగమించి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేశారు. అందుకే భారతీయులు మోడీ హైతో ముమ్‌కిన్‌ హై అంటారని చెప్పానని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు