Thursday, May 2, 2024

ఖతార్‌లో ఎనిమిది మంది మరణశిక్షలపై భారత్‌ అప్పీల్‌

తప్పక చదవండి

న్యూఢిల్లీ : తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఎనిమిది మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్‌ దేశ న్యాయస్థానం విధించిన మర ణశిక్షపై అప్పీల్‌ చేశామని భారత్‌ వెల్లడిరచింది. సంబంధిత అంశాలను ఢల్లీిలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చీ వివరించారు. ‘మంగళవారమే ఆ ఎనిమిది మందితో సంప్రదిం పులు జరిపే అవకాశం దోహా నగరంలోని భారతీయ ఎంబసీ దౌత్యాధికారులకు లభించింది. నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారులతో మనవాళ్లు మాట్లాడారు. వారికి న్యాయ, దౌత్యపరమైన పూర్తి రక్షణ కలిపించేందుకు భారత ప్రభుత్వం కృషిచేస్తోంది’ అని బాగ్చీ అన్నారు. వీరికి మరణశిక్ష ఖరా రుచేస్తూ ఖతర్‌ కోర్టు అక్టోబర్‌ 26వ తేదీన తీర్పు ఇవ్వగానే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. వారికి విముక్తి కలిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన దౌత్య మార్గాలను అన్‌వ్‌భ్ఘేస్తోంది. ’అల్‌ దహ్రా గ్లోబల్‌ అనే ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసిన వీరిపై ఖతర్‌ మరణశిక్ష మోపింది. తీర్పు వివరాలు అత్యంత గోప్యమైనవి. వీటిని కేవలం న్యాయ బృం దంతోనే భారత్‌ పంచుకుంటోంది. తదుపరి చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే అప్పీల్‌ కూడా చేశాం. బాధితుల కుటుంబాలతో మాట్లాడాం. ఇటీవలే వారి కుటుంబసభ్యులను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు‘ అని బాగ్చీ చెప్పారు. అసలు వీరు ఏ విధమైన గూఢచర్యానికి పాల్పడ్డారనే వివరాలను ఇంతవరకు ఖతర్‌ న్యాయస్థానం బహిరంగంగా
వెల్లడిరచలేదు. కేసులోని సున్నితత్వం దృష్ట్యా ఈ అంశంపై భారత్‌ తరఫున ఉన్నతాధికారులూ బహిరంగంగా ఏవిూ మాట్లాడలేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు