Saturday, May 4, 2024

జపాన్‌ సముద్రంలో కొత్త ద్వీపం

తప్పక చదవండి

టోక్యో : మూడు వారాల కిందట జపాన్‌లోని సముద్రంలో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది ఓ కొత్త ద్వీపం(ఐలాండ్‌) ఏర్పడిరది. అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు. ఐవో జిమా దక్షిణ కోస్తాతీరానికి కిలోవిూటరు దూరంలో అక్టోబరు 21న అగ్నిపర్వతం విస్ఫోటం చెందిందని, అనంతరం పదిరోజుల్లోనే బూడిద, రాళ్లు పేరుకొని 100 విూటర్ల వ్యాసంతో.. సముద్ర మట్టానికి 20 విూటర్ల ఎత్తులో కొత్త ద్వీపం ఏర్పడినట్లు జపాన్‌ వాతావరణ సంస్థకు చెందిన యుజి ఉసుయ్‌ అనే విశ్లేషకుడు తెలిపారు. దాన్ని నిపుణులు విశ్లేషిస్తున్నారని, అయితే అది ఎక్కువ కాలం ఉండకపోవచ్చని వారు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు