Sunday, May 5, 2024

పదవీ బాధ్యతలు చేపట్టిన మంత్రులు

తప్పక చదవండి
  • జిల్లాలో పర్యటించిన మంత్రులు
  • ఘనస్వాగతం పలికిన పార్టీశ్రేణులు

పాల్వంచ (ఆదాబ్‌ హైదరాబాద్‌): డిప్యూటీ సిఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు పదవీ బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన సందర్భంగా ఆదివారం మంత్రులకు జిల్లాలో అడుగడుగునా కాంగ్రెస్‌, సిపిఐ, తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌టిపి శ్రేణులు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. పాల్వంచ మండల కేంద్రంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో మంత్రులకు అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. పట్టుశాలువా కప్పి, పుష్పగుచ్చం అందించి మిత్రపక్ష శ్రేణులు అభినం దనలు తెలిపారు.ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మిత్రపక్షాల శ్రేణులను ఉద్ధేశించి వారు మాట్లాడారు. ఎన్ని ఆర్థిక సవాళ్లు వచ్చినా అధిగమించి కాంగ్రెస్‌పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేసితీరుతామన్నారు. కాంగ్రెస్‌ఇచ్చిన మాటను తప్పదని, ఎప్పుడు వెనక్కి తీసుకోలేదని, ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు. ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేసిందని తెలిపారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసిబస్సు ప్రయాణసౌకర్యాన్ని కల్పించి గ్యారంటీని నెరవేర్చామన్నారు. ఆరోగ్య తెలంగాణగా ఉండాలని ప్రతి ఇంటికి లబ్ధిచేకూర్చే విధంగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10లక్షలకు పెంచుతూ రెండో గ్యారంటీని అమలు చేశామ న్నారు. మిగతా నాలుగు గ్యారంటీలు కూడా 100రోజుల్లోపు అమలు చేస్తామని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి ప్రజలుప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. దశాబ్ధకాలం ఈరాష్ట్రాన్ని పరి పాలించిన కెసిఆర్‌ ప్రజల సంపదను దోపిడీ చేశారన్నారు. ప్రజల సొమ్మును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వలో ఉన్న పెద్దలు లుటీ చేయడంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విసిగి వేశారిపోయిన ప్రజలు మార్పును కోరుకున్నారన్నారు. ప్రజలు కోరుకున్న మార్పులకు అనుగుణంగా వారిఆశలు,ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి మేము శక్తివంచన లే కుండా కృషి చేస్తామన్నారు. గిరిజ నులు ఎక్కుగా ఉన్న ఈప్రాంతఅభివృద్ధి కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలోనే జరిగిందన్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతఅభివృద్ధి కాంగ్రెస్‌ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీనుంచి గెలుపొందిన ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేసి బీఆర్‌ఎస్‌లో చేరడం వల్ల గెలిపించిన శ్రేణులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారన్నారు.పార్టీకి ద్రోహంచేసి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ద్రోహిని ఓడిరచాలని కసితోపని చేసిన సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావును గెలిపించిన పార్టీశ్రేణులకు అభినందనలు తెలిపారు. సాంబశివరావు మృధుస్వభావి రాజకీయాలు చేయకుండా ప్రజాసేవ చేయాలని నిత్యం ఆలోచన చేసే ఎమ్మెల్యేని గెలిపించుకోవడం మీఅదృష్టిం అన్నారు. ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టకొని ప్రజలను పీడిరచాలనే మనస్తత్వం ఉన్న వ్యక్తి సాంబశివరావు కాదన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు