Monday, May 13, 2024

విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల్లో రికార్డు..

తప్పక చదవండి

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఈ నెల తొలి ఆరు సెషన్లలో విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) రూ.26,505 కోట్ల విలువైన షేర్ల కొనుగోలు చేశారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడంతో దేశీయంగా రాజకీయ సుస్థి రత బలోపేతం అవుతుందన్న అంచనాల మధ్య ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడిరది. దేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రోత్సాహానికి దోహద పడుతుంది. గత అక్టోబర్‌ నెలలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.9,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రూ.39,300 కోట్ల పెట్టుబడు లను ఉపసంహరించారు. అయితే, మారిన పరిస్థితుల్లో విదేశీ పోర్ట్‌ ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో షేర్లు కొనుగోలు చేయొచ్చునని జియోజిట్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్‌వెస్ట్‌ స్ట్రాటర్జిస్‌ వీకే విజయ కుమార్‌ తెలిపారు. ఈ నెల ఎనిమిదో తేదీ నాటికి దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐల నికరంగా రూ.26,505 కోట్లు పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లలో రూ.1.31 లక్షల కోట్లు, డెట్‌ మార్కెట్లలో రూ.55,867 కోట్ల పెట్టుబడులు పెట్టారు. బాండ్ల మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే డెట్‌ మార్కెట్లోకి అక్టోబర్‌ నెలలో రూ.6,381 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత నెలలో ఆరు నెలల గరిష్ట స్థాయిలో ఎఫ్‌పీఐ లు రూ.14,860 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ధరలు తగ్గుతున్న నేపథ్యం లో విదేశీ ఇన్వెస్టర్లు.. భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని మార్నిం గ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. ఐటీ, టెలికం, ఆటోమొబైల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు