Saturday, May 18, 2024

కార్తీక వనసమారాధన మన సంప్రదాయం

తప్పక చదవండి
  • నమారాదన వేడుకల్లో ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి..

సూర్యాపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తీక వనభోజనాలు మనకు చాటిచెబుతాయని సూర్యాపేట ఎమ్మేల్యే గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి అన్నారు.ఆదివారం ఆత్మకూర్‌ (ఎస్‌) మండలం నెమ్మికల్‌ గ్రామంలో సంతోషి మాతా రూపాదేవి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసన సభ్యులు జగదీష్‌ రెడ్డి,శివ లింగాలతో మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. శివలింగాలకు భక్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ దేశసంస్కృతి ,సంప్రదాయాలను, హైందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తున్నాం అన్నారు.ఇందులో భాగమే కార్తీక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం అన్నారు.వనభోజనాల మధుర స్మృతులు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. మానవ మనుగడకు వనాలు చేసే మేలు అంతా ఇంతా కాదన్నారు.భవిష్యత్‌ తరాలకు కూడా మేలు చేకూర్చే వృక్షజాతిని సంరక్షించాలనే నిగూఢ సందేశాన్ని వనసమారాధన అందిస్తోంది అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు