Friday, May 3, 2024

రెజిమెంటల్‌ బజార్‌లోజోరుగా అక్రమ కట్టడాలు

తప్పక చదవండి

రాంగోపాల్‌ పేట్‌ : సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌ లో అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. బల్దియా అనుమతి లేకుండా 4,5 అంతస్తుల నిర్మాణాలు జరుగుతు న్నాయి.రెజిమెంటల్‌ బజార్‌ లో ఓవైపు అక్రమంగా ఏర్పడ్డ లాడ్జితో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.మరో వైపు బల్దియా అనుమ తులు లేకుండా 5,6అంతస్తుల అక్రమ నిర్మాణంతో ..ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపు తుంది.హిల్స్‌ స్ట్రీట్‌ స్కూల్‌ సమీపంలో రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తుండగా,సంతోషి మాతా ఆలయం సమీపంలో అనుమతులు లేకుండ 5 అంతస్తులు నిర్మాణం చేస్తున్నారు.ఈ రెండు అక్రమ నిర్మాణాల వెనుక స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకుడు ఉన్నాడని…అయన అండదం డలతో జోరుగా నిర్మాణం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చర్యలు చేపట్టాల్సిన బేగంపేట్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం మొద్దు నిద్రలో ఉంది.అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు విచ్చల విడిగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నా పర్యవేక్షణ లోపించడం వల్ల అక్రమార్కులకు వరంగామారింది..ఇప్పటికైనా మున్సిపల్‌ టౌన్‌ నాని అధికారులు సిబ్బందికి అక్రమ కట్టడాలపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు