పాలక పక్షం శ్వేత పత్ర సెగలు..
గత పాలకుల్లో గుబులు.. అప్పుల కుప్పగా
రాష్ట్రం.. ఒక్కో కుటుంబానికి 7 లక్షల
అప్పు నెత్తిన కత్తై వేలాడుతుంది..
దినాం ఖర్చులకు నిధులు లేని దీనస్థితి..
అధిక వడ్డీల మోత..
రిజర్వ్ బ్యాంకు చుట్టూ
ఓడి ‘‘వేస్ అండ్ మీన్స్’’ అప్పు కోసం
పడిగాపులు.. మసిబూసే గ్లోబెల్స్ ప్రచారంతో
వాస్తవాలు దాస్తుండ్రు..
ఆర్థిక సంక్షోభాల తీరు మారాలి..
ప్రతి ఏడు శ్వేత పత్రాన్ని ప్రకటించి
వాస్తవాలు తెలిపేలా చట్టం రావాలి..
మార్పు ఈ ప్రభుత్వం నుండే మొదలవ్వాలి..
` మేదాజీ