Monday, December 4, 2023

ఈసారి గెలిపిస్తే మీ ఇళ్లే కొట్టేస్తారు…

తప్పక చదవండి
  • అబద్ధాలులు చెప్పడంలో గంగులను మించినోడు లేడు
  • తన ఆస్తుల డాక్యుమెంట్లు తీసుకువస్తే అవి ప్రజలకే ఇస్తానని సవాల్
  • కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ గురించే తెలియదని ఎద్దేవా
  • కేసీఆర్‌కు మూడోసారి అధికారమిస్తే అంతే సంగతులన్న బండి సంజయ్

కరీంనగర్‌ : సీఎం కేసీఆర్‌, మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ నేత బండి సంజయ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వాళ్లది కబ్జాల ఆరాటం….నాది పేదల పోరాటం. ఎటువైపు ఉంటారో విూరే తేల్చుకోండి’’ అని అన్నారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ.. అబద్దాలు, మోసాలు, భూకబ్జాల్లో గంగుల కమలాకర్‌ నెంబర్‌ వన్‌ అని ఆరోపించారు. బియ్యం టెండర్లలో గంగుల రూ.1300 కోట్ల గోల్‌ మాల్‌ చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ ఇంట్లో ఐదుగురికి పదవులున్నయ్‌ అని.. నిరుద్యోగులు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఏమైందని నిలదీశారు. ఫస్ట్‌కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్‌కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అని బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. గంగుల కమలాకర్‌కు ఎమ్మెల్యేగా మూడుసార్లు అవకాశమిస్తే భూములు కొల్లగొట్టాడని, గుట్టలను మాయం చేశాడని, పొరపాటున మళ్లీ గెలిపిస్తే ఈసారి మీ ఇళ్లను కూడా కొట్టేయడం ఖాయమని సంజయ్ అన్నారు. అబద్ధాలు చెప్పడంలో గంగులను మించినోడు లేడని, అందుకే తనను అవినీతిపరుడు అంటున్నాడని మండిపడ్డారు. నేను అధికారంలోనే లేను… అవినీతికి ఎలా పాల్పడతాను? అని ప్రశ్నించారు. ఒకవేళ అవినీతికి పాల్పడినట్లయితే… తనను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నిలదీశారు. తనపై ఆరోపణలు చేశాడని, కాబట్టి తన ఆస్తులకు సంబంధించిన డాకుమెంట్లు అన్నింటినీ గంగుల తీసుకు రావాలని… అప్పుడు ఆ ఆస్తులన్నింటిని ప్రజలకే ఇచ్చేస్తానన్నారు. గంగుల కమలాకర్ కూడబెట్టిన ఆస్తుల డాక్యుమెంట్లను కూడా తీసుకువస్తే, అవి కూడా ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ గురించే తెలియదని, రేషన్ కార్డులు, పెన్షన్లు ఎలా ఇస్తారు? అనే విషయం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. భూకబ్జాలు చేయడం తప్ప, ప్రజల కోసం కొట్లాడింది లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్… ఇద్దరు అభ్యర్థులది భూకబ్జాల పంచాయతీయేనని ఆరోపించారు. పేదల కోసం ఎంతకైనా తెగించే నైజం తనదని, కాబట్టి ఎటువైపు ఉంటారో తేల్చుకోవాలని సూచించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు