Sunday, April 28, 2024

రిలయన్స్‌కు భారీ లబ్ధి..

తప్పక చదవండి
  • మూడు సంస్థల ఎం-క్యాప్‌ రూ.70,312 కోట్ల వృద్ధి..!

గతవారం స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్‌-10 సంస్థల్లో మూడు సంస్థలు రూ.70,312.7 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పెంచుకున్నాయి. మార్కెట్‌లో ఒడిదొడుకుల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీగా లబ్ధి పొందింది. రిలయన్స్తోపాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) లాభ పడ్డాయి. మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్పోసిస్‌, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ), భారతీ ఎయిర్‌టెల్‌, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) సంస్థలు రూ.68,783.2 కోట్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కోల్పోయాయి. గతవారం రికార్డ్‌ బ్రేక్‌ ర్యాలీ తర్వాత బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 376.79 పాయింట్లు (0.52 శాతం) నష్టపోయింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.47,021.59 కోట్లు వృద్ధి చెంది రూ.17,35,194.85 కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌) ఎం-క్యాప్‌ రూ.12,241.37 కోట్లు పుంజుకుని రూ.6,05,043.25 కోట్ల వద్ద స్థిర పడిరది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.11,049.74 కోట్లు పెరిగి రూ.12,68,143.20 కోట్ల వద్ద ముగిసింది. మరోవైపు, ఐసీఐసీఐ బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.30,235.29 కోట్లు నష్టపోయి రూ.6,97,095.53 కోట్ల వద్ద స్థిర పడిరది. టీసీఎస్‌ ఎం-క్యాప్‌ రూ.12,715.21 కోట్లు పతనమై రూ.13,99,696.92 కోట్ల వద్ద నిలిచింది. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ఎం-క్యాప్‌ రూ.10,486.42 కోట్లు తగ్గి రూ.5,68,185.42 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్‌ ఎం-క్యాప్‌ రూ.7,159.5 కోట్ల నష్టంతో రూ.6,48,298.04 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐటీసీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3,991.36 కోట్ల పతనంతో రూ.5,67,645.03 కోట్ల వద్ద స్థిర పడిరది. భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2,108.17 కోట్ల నష్టంతో రూ.5,56,134.58 కోట్ల వద్ద నిలిచింది. ఎల్‌ఐసీ ఎం-క్యాప్‌ రూ.2,087.25 కోట్లు కోల్పోయి రూ.5,01,635.57 కోట్ల వద్ద ముగిసింది. గత వారం స్టాక్‌ మార్కెట్లలో ట్రేడిరగ్‌ ముగిసిన తర్వాత బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్‌ సంస్థల్లో రిలయన్స్‌ అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గల సంస్థగా నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్పోసిస్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌ (హెచ్‌యూఎల్‌), భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ), ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, ఎల్‌ఐసీ నిలిచాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు