Monday, May 13, 2024

కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్టోర్‌ను ఆవిష్కరించిన మైసూర్‌ శారీ ఉద్యోగ్‌

తప్పక చదవండి

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): భారత సంప్రదాయ దుస్తుల బ్రాండ్‌లలో అగ్రగామిగా ఉన్న మైసూర్‌ శారీ ఉద్యోగ్‌ సంస్థ హైదరాబాద్‌లో తన కొత్త ఫ్లాగ్‌షిప్‌ అవుట్‌లెట్‌ను ప్రారంభించి నట్లు ప్రకటించింది. బెంగుళూరు కేంద్రంగా విస్తృతమైన వినియోగదారులకు కలిగిన ఈ సంస్థ జూబ్లీ హిల్స్‌లో నెలకొల్పిన ఈ కొత్త స్టోర్‌ దాని ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. తమ బ్రాండ్‌కు మాత్రమే సొంతమైన స్టయిల్‌ను కొనసాగించడంతో పాటు అద్భుతమైన హస్తకళ, సాంప్రదాయ నేతల సంరక్షణ పట్ల తమ నిబద్ధతను నొక్కి చెబుతుంది. నాలుగు అంతస్తులలో 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కొత్త స్టోర్‌ లో స్వచ్ఛమైన పట్టు చీరలు, లెహం గాలు, బట్టలు (ఫాబ్రిక్స్‌), రెడీ-టు-వేర్‌, కుట్టని సూట్లు, సల్వార్‌ కమీజ్‌, దుపట్టాల అద్భుతమైన కలెక్షన్లు వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇవన్నీ సాంప్రదాయ, సమకాలీన శైలులను సజావుగా మిళితం చేసి ప్రతి సందర్భానికి అను గుణంగా ఉంటాయి.

ఇన్‌హౌజ్‌ డిజైన్లు, ప్రత్యేకమైన, అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడం ఈ కలెక్షన్ల ప్రత్యేకత. దీనికి తోడు స్టోర్‌లో లభించే ప్రతి ఫ్యాబ్రిక్‌ను ఆన్‌-సైట్‌ రియల్‌-జారీ టెస్టింగ్‌, సిల్క్‌ మార్క్‌ సర్టిఫికేషన్‌ల ద్వారా వాటి నాణ్యతను, నిజమైన విలువను తెలుసుకోవచ్చు. బెంగుళూరు లోని స్టోర్‌తో ఈ స్టోర్‌ ను అనుసంధానం చేశారు. తద్వారా వాట్సాప్‌ కామర్స్‌, వీడియో కాల్‌ షాపింగ్‌ ద్వారా అక్కడి ధరలతో సరిపోల్చుకునే గ్యారంటీ, విభిన్న కస్టమర్‌ సర్వీస్‌ ఆప్షన్‌ను కూడా మైసూర్‌ శారీ ఉద్యోగ్‌ తమ కస్టమర్లకు అందిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థకు ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకొని మైసూర్‌ శారీ ఉద్యోగ్‌ బ్రాండ్‌ ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండిరటిలోనూ ఆకర్షణీయమైన, వ్యక్తిగతీకరించిన షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తామని హామీ ఇస్తోంది. ఈ కొత్త అవుట్‌లెట్‌ ఒక స్టోర్‌గానే కాకుండా తమ బ్రాండ్‌పై ఉన్న అంచనాలను అధిగమించడానికి, నగరంలోని అత్యంత వివేకం గల వినియోగదారులను కూడా సంతృప్తిపరిచే నిబద్ధతను కూడా హామీ ఇస్తోంది. తమ బ్రాండ్‌ విస్తరణ గురించి మైసూర్‌ శారీ ఉద్యోగ్‌ వ్యవస్థాపకులలో ఒకరైన దినేష్‌ తలేరా మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ నడిబొడ్డున, సుంద రమైన పరిసరా లతో కూడిన ఈ ప్రాంతం మా బ్రాండ్‌ లాగా శాశ్వతమైన శోభను వెదజల్లుతుంది. మా సంస్థ నాలుగు దశా బ్దాల విశిష్ట వారసత్వాన్ని కలిగి ఉంది. అత్యంత పారదర్శకత, ఉన్నతమైన నాణ్యత, వినియోగారుల సంతృప్తితో కూడిన మా ప్రధాన డీఎన్‌ఏపై ఏమాత్రం రాజీపడకుండా ఈ ట్రెండ్‌లను కొనసాగించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. మా విలువలను ప్రతిధ్వనించే, హస్తకళను, గొప్ప వారసత్వాన్ని ఆదరించే, మా అంకితభావాన్ని పటిష్టం చేసే కొత్త మార్కెట్‌లోకి ప్రవేశించడానికి మేము సంతోషిస్తున్నాం’ అని అన్నారు. మైసూర్‌ శారీ ఉద్యోగ్‌ 1982లో ప్రారంభమైంది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా 3,000 మందికి పైగా కళాకారుల నైపుణ్యానికి మద్దతు ఇస్తూ భారతీయ టెక్స్‌ టైల్స్‌ వారసత్వాన్ని కాపాడే ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ అధునాతనతకు చిహ్నంగా, సాంప్రదాయ దుస్తులు, చీరల అభిమానులకు సాంస్కృతిక మూలస్తంభంగా మారింది. కర్ణాటకను దాటి విస్తరిస్తున్న సమయంలో ఈ బ్రాండ్‌ తన ఆఫ్‌లైన్‌ రిటైల్‌ వ్యవస్థను పటిష్టం చేయడానికి, తమ నాణ్యత, సంప్రదాయాన్ని కొత్త దిక్కులకు తీసుకెళ్లడానికి సిద్ధమైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు