Thursday, May 2, 2024

హైదరాబాద్‌ చర్లపల్లిలో భారీ పేలుడు

తప్పక చదవండి

హైదరాబాద్‌ :ఈ ఉదయం హైదరాబాద్‌ లోని చర్లపల్లిలో భారీ పేలుడు సం భవించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో భారీ శబ్దంతో చోటుచేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్‌ హోల్‌ మూత ఎగిరిపడిరది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

స్థానికుల ద్వారా సమా చారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరి శ్రమల వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడంతో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. చర్లపల్లిలోని వెంకట్‌రెడ్డి నగర్‌లో గల మధుసూదన్‌రెడ్డి నగర్‌లో ఈ అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు