Monday, May 6, 2024

పెరుగుతున్న జపాన్‌ భూకంప మృతుల సంఖ్య

తప్పక చదవండి

టోక్యో : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య పెరు గుతోంది. మంగళవారం ఉదయం దాకా 13గా ఉన్న మృతుల సంఖ్య సాయంత్రానికి 63కి చేరు కుంది . మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. భవ నాలు కూలడం, అగ్నిప్రమాదాల కార ణంగానే ఎక్కువ మంది చనిపోయారు. క నీగట, టొయోమ, పుకూయ్‌, గిపూ నగరాల్లో భారీ సంఖ్య లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేలకు పైగా ఇళ్లకు విద్యు త్‌ సరఫరా నిలిచి పోయింది. పలు ప్ర ధాన రహదారులు పని చేయలేదు. ఫలితంగా సహాయక చర్య ల్లో పాలు పంచుకుంటున్న వైద్యులు, ఆర్మీ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం మ ధ్యాహ్నం సమయంలో 7.6 తీవ్రతతో పెను భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మరోవైపు, టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో మంగళవారం రెండు విమానాలు ఢీకొట్టుకు న్నాయి. సపోరో నగరంలోని షిన్‌ చిటోస్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్‌ 516 విమానం హనెడా విమానాశ్రయంలో దిగుతున్న (ల్యాండిరగ్‌) సమయంలో కోస్టు గార్డు (తీర రక్షక దళం) విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్యాసింజర్‌ విమానం మంటల్లో చిక్కుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్త మైన ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేప ట్టా రు. విమానంలో ఉన్న 379మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న అయిదుగురు సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ప్యాసింజర్‌ విమానం(ఎయిర్‌ బస్‌ ఏ`350) పూర్తిగా దగ్ధమైంది. భూకంప బాధితులకు సాయం చేసేందుకు వెళ్తున్న క్రమంలో కోస్టు గార్డు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కోస్టు గార్డు విమానం హనెడా ఎయిర్‌పోర్టు నుంచి పశ్చిమ జపాన్‌లోని నిజటాకు బయల్దేరాల్సి ఉంది. రన్‌ వే క్లియరెన్స్‌ కోసం వేచి చూస్తోంది. అంతలోనే జేఏఎల్‌ 516 విమానం ల్యాండ్‌ అయి దానిని ఢీ కొట్టింది. ప్రమాదానికి గల కారణాలపై విమానాశ్రయ అధికారులు ఆరా తీస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు