Tuesday, July 16, 2024

జ్వరాలు బాబోయ్.. జ్వరాలు..!

తప్పక చదవండి
  • డెంగ్యూ, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రులు కిటకిట.
  • వాతావరణ మార్పులతో రోగాల బారిన జనం.
  • ఇప్పటికే జిల్లాలో విజృంభించిన అంటు వ్యాధులు.
  • సోద్యం చూస్తున్న జిల్లా వైద్య యంత్రాంగం.
  • వైరల్ ఫీవర్లపై గ్రామాల ప్రజలు ఫిర్యాదులు.
  • మాకేమవుతుందిలే అంటున్న జిల్లా వైద్యాధికారి.
  • ఆందోళన చెందుతున్న పట్టణ.. గ్రామాల ప్రజలు.

మేడ్చల్ : అసలే వానల కాలం.. దీనికి తోడు వ్యాధుల కాలం.. గత కొన్ని రోజలుగా అల్పపీడన ద్రోణీ.. దీని కారణంగా, వాతావరణంలో మార్పులు సంభవించి మబ్బులు ముసురుకొని వర్శాలు పడుతున్నాయి. దీంతో ఒక్క సారిగా జిల్లాలో అంటు వ్యాధులు పంజా విప్పాయి. వాతావరణ మార్పులతో వైరల్ ఫీవర్లు మొదలయ్యాయి. పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ఎక్కడ చూసినా డెగ్యూ, వైరల్ ఫీవర్లు, వాంతులు, విరేచనాలు, మలేరియా వ్యాధులతో జనం ఆసుపత్రుల బాట పడుతున్నారు. జిల్లాలోని ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, మేడ్చల్ నియోజకవర్గం, మేడ్చల్, శామీర్ పేట ఎంసీ పల్లి, ఘట్ కేసర్ మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. వైరల్ ఫీవర్లతో జనం ఆసుపత్రుల పాలవుతుండడంతో అటు ప్రభుత్వ ఆసుపత్రులు. ఇటు ప్రైవేటు దవాఖానలు రోగులతో కిక్కిరిసి పోతున్నాయి. ఒళ్లు నొప్పులు, తలనొప్పులు, వాంతులు, విరేచనాలు, వైరల్ ఫీవర్లు జనంపై పడగవిప్పి వ్యాధులు పంజా విసురుతున్నాయి. ప్రతీయేటా వర్శాకాలం ప్రారంభంలోనే వ్యాధులు ప్రభలడం సహజమే. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో వ్యాధులు విజృంభిస్తుండడంతో జనంలో భయాందోళనలు ఏర్పడుతున్నాయి. వైరల్ ఫీవర్లు. డయేరియా కేసులు ఇతర అంటు వ్యాధులు ప్రభలే ఆస్కారం ఉండడంతో అటు వైద్యారోగ్య శాఖ, ఇటు గ్రామ పంచాయతీ అధికారులు, పాలకులు. మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అయినప్పటికీ జిల్లాలో మాత్రం వ్యాధుల పట్ల జిల్లా వైద్యాధికారులు ఎలాంబటి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

విస్తరిస్తున్న వైరల్ ఫీవర్లు :
గత కొన్ని రోజులుగా కురిసిన వర్శాలతో వైరల్ ఫీవర్లు అధిక మయ్యాయి. వాతావరణంలో సంభవించిన మార్పలతో వైరల్ ఫీవర్లు అధికమై అటు ప్రభుత్వ ఆసుపత్రులు, ఇటు ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిట లాడుతున్నాయి. ఆకస్మాత్తుగా కాళ్లు చేతుల నొప్పులు, తలనొప్పులు, జ్వరం భారీన పడడం వైరల్ పీవర్లు సమస్య అధికకంగా మారుతోంది. తొలకరి వర్శాలతో కొత్త నీరు భూగర్భంలోకి చేరుతుండడంతో ఆ నీటిని సేవించడం వల్ల అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. కాగా గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రం చేయక అస్తవ్యస్తంగా ఉండడంతో దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తూ వ్యాధులను విస్తరింప జేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న వ్యాధులతో జిల్లా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తతున్నాయి.

- Advertisement -

వ్యాధులపై కానరాని ముందస్తు చర్యలు :
వానకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు ప్రభలడం ప్రతీ ఏడాది కనిపిస్తుంది. అయితే ఈ వ్యాధులపై ముందుస్తు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొక పోకపోవడంతో జిల్లాలోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. కానీ ఈ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు
చేపట్టడంలో వైద్యారోగ్యశాఖ, ఇటు పంచాయతీరాజ్, మున్సిపల్ యంత్రాంగం విఫలమవుతున్నారు. గ్రామాలలో వ్యాధులు ప్రబలినప్పుడే ఆరోగ్యశాఖ ఆర్బాటం చేస్తూ, వగాహన సదస్సులు నిర్వహించడం పరిపాటిగా మారింది. అయితే ఈ విషయంలో ముందస్తుగా ఆరోగ్యశాఖ, పంచాయతీ రాజ్ శాఖలు చర్యలు చేపడితే ఈ సమస్యలు తలెత్తవని గ్రామాల ప్రజలు కోరుతుతున్నారు. ఇప్పటికైన రెండు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జనం రోగా బారిన పడకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు. కానీ జిల్లాలో భీ అలర్ట్ అంటూ అధికార యంత్రాంగానికి వ్యాధులు సవాల్ విసురుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు