Thursday, May 16, 2024

కామారెడ్డిలో కనుమరుగవుతున్న చారిత్రక ఆనవాళ్లు..

తప్పక చదవండి
  • కాపాడుకోవాలంటున్న చరిత్రకారులు శివనాగిరెడ్డి, శ్రీకాంత్

కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆల్కహాల్ ఫ్యాక్టరీ సమీపంలో క్రీ.పూ. 1000 ఏళ్ల నాటి ఇనుప యుగపు సమాధులు కనుమరుగౌతున్నాయని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సిఈఓ, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానిక ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు మంచాల శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం నాడు ఆయన ఆ కట్టడాలను పరిశీలించారు. గతంలో 25 కు పైగా ఉన్న బండరాళ్ల సమాధులు ప్రస్తుతం రెండు మాత్రమే మిగిలాయని, పట్టణీకరణలో భాగంగా వీటిని తొలగిస్తున్నారని శివనాగిరెడ్డి, శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. 15 నుండి 25 అడుగుల వ్యాసంతో, ఒక మీటరు పొడవు, ఒక అడుగు ఎత్తున్న 15 నుంచి 18 వరకు గల గుండు రాళ్ళను గుండ్రంగా అమర్చి నిర్మించే ఈ ఇనప యుగపు సమాధుల్లో ఆనాటి మానవుల అస్తికలు, వారు వాడిన పనిముట్లు, పాత్ర సామాగ్రిని నిక్షిప్తం చేసేవారని, ఇప్పటికి మూడు వేల సంవత్సరాల క్రితం సాంప్రదాయాలకి ఇవి అర్థం పడుతున్నాయని, ఈ సమాధుల వల్ల కామారెడ్డి పట్టణానికి 3000 ఏళ్ల చరిత్ర ఉందని తెలుస్తుందని, వీటిని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాలని కామారెడ్డి మునిసిపల్ అధికారులకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సాంకేతిక సిబ్బంది, ఆర్.జితేందర్, జుగంధర్, స్థానిక చరిత్ర పరిశోధకుడు శ్రీకాంత్ మంచాల పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు