Monday, April 29, 2024

దాచిన సొమ్ముతో ఉచిత రేషన్‌

తప్పక చదవండి
  • పీఎం గరీబ్ యోజన’ను మరో ఐదేళ్ల పొడిగింపు
  • కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం చేసిందేమీ లేదు
  • మధ్యప్రదేశ్ లో ఎన్నికల సభలో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : ‘పీఎం గరీబ్ యోజన’ను మరో ఐదేళ్ల పొడిగించనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిసెంబర్‌తో ఈ పథకం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పేద ప్రజల బాధ తమకు బాగా తెలిసినందున డిసెంబర్ తర్వాత కూడా వచ్చే ఏదేళ్లు ఉచిత రేషన్ గ్యారెంటీ తిరిగి ఇవ్వాలని తాము నిర్ణయించామని ప్రధాని చెప్పారు. మధ్యప్రదేశ్‌ లోని సియోనిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, బీజేపీ గెలువబోతోందన్న గ్యారెంటీ ప్రజలు ఇస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారు ఆరు దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గిరిజనుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. అటల్ బిహారి వాజ్పేయీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాకే.. గిరిజనుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటైందని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్ లోని సిన్ని జిల్లాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. కాంగ్రెస్పై విమర్శలు చేశారు.

“కాంగ్రెస్ పాలనలో లక్షల కోట్ల రూపాయల స్కామ్లు జరిగాయి. కానీ, భాజపా అధికారంలోకి వచ్చాక అలాంటివి జరగలేదు. అలా ఆదా చేసిన నగదుతోనే భారత్లోని 80 కోట్ల మంది పేదలకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచిత రేషన్ అందిస్తున్నాం. నేను పేద కుటుంబం నుంచి వచ్చాను. కరోనా సమయంలో అన్ని మూతపడితే.. పేదవారు తమ పిల్లలకు ఆహారం ఎలా పెడతారని ఆలోచించా. వారి కోసం ఉచిత రేషన్ అందించాలని నిర్ణయించి, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ప్రారంభించాం. దీని ద్వారా ఎంతో మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆహారం అందివ్వగలుగుతున్నారు. దీన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగిస్తాం” అని ప్రధాని తెలిపారు. కోవిడ్ సంక్షోభ సమయంలో దేశ ప్రజలను కాపాడుకునేందుకు ఎంతవరకూ చేయగలమో అంతా తాము చేశామని, కటిక పేదరికంలో ఉన్న ప్రజలకు కూడా ఆహారకొరత లేకుండా చేశామని, ఉచిత రేషన్ ఇచ్చామని చెప్పారు. 2014 సంవత్సరానికి ముందు కాంగ్రెస్ ప్రతి కుంభకోణం లక్షల కోట్లలో ఉండేదని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో స్కాములే లేవని చెప్పారు. పేద ప్రజల హక్కులు కాపాడేందుకు దాచిన డబ్బులను పేద ప్రజల రేషన్‌కు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి, స్కాముల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా అదేనని అన్నారు. భాజపా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల వల్లే భారత్లో మొబైల్ ఫోన్లు, మొబైల్ డేటా తక్కువ ధరకే లభిస్తున్నాయని అన్నారు. జనరిక్ ఔషధ కేంద్రాల ద్వారా 80 శాతం డిస్కౌంట్తో ఔషధాలు విక్రయించడం వల్ల ప్రజలు సుమారు రూ.25,000 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు.

- Advertisement -

“మధ్యప్రదేశ్లో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ కుమారులకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీపై ఆధిపత్యం కోసం పోటీపడుతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటకీ.. ప్రధాన పోటీ మాత్రం ఆ ఇరువురు నేతల మధ్య జరుగుతోంది” అని ప్రధాని ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ టికెట్లు రాని అసంతృప్తులు కమలానాథ్ ఎదుట ఆందోళనకు దిగగా.. “వెళ్లి తండ్రీకొడుకులు దిగ్విజయ్సింగ్, జైవర్ధన్ సింగ్ల దుస్తులు చించండి” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ మాజీ సీఎంల మధ్య సంబంధాలు బయటకు కనిపిస్తున్నంత బాగా ఏమీలేవంటూ ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఇరువురు నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్లో నవంబరు 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు