Friday, May 10, 2024

జిల్లా ప్రజల్లో నమ్మకాన్ని చేకూర్చేలా ఫ్లాగ్‌ మార్చ్‌

తప్పక చదవండి
  • జిల్లాకు చేరుకున్న 3 కంపెనీల బిఎస్‌ఎఫ్‌ బలగాలు
  • తెలిపిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాః బి. గోపి

కరీంనగర్‌ : రానున్న అసెంబ్లి ఎన్నికల దృశ్యా ప్రజల్లో ఓటుపై నమ్మకాన్ని, విస్వాసాన్ని కల్పించే దిశగా పోలిస్‌, బిఎస్‌ఎఫ్‌ బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాః బి. గోపి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో పొలీస్‌ కమీషనర్‌ తొ కలిసి ఫ్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాః బి. గోపి ప్రారంభించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ, రాబోయో అసెంబ్లీ ఎన్నికలు-2023 లను ప్రశాంతంగా జరిపించే క్రమంలో 3 కంపెనీల బిఎస్‌ఎఫ్‌ బలగాలు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో యం.సి.సి, యం.సి.యం.సి, స్టాటిక్‌ సర్వేలైన్‌ టీం, వీడియో సర్వే లైన్‌ టీం, ఇంటర్‌ డిస్ట్రిక్‌ చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో నాలుగు నియోజక వర్గాలలో ఎన్నికల విధులను విజయవంతం చేయడంలో భాగంగా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు బి ఎస్‌ ఎఫ్‌ బలగాలు జిల్లా యంత్రాంగంతో మమేకమై విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలలో వీరిని కేటాయించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఫ్లాగ్‌ మార్చ్‌ ని పరేడ్‌ గ్రౌండ్‌ నుండి ప్రారంభించి ఒకటవ ఠాణా, రాజీవ్‌ చౌక్‌, వైశ్యభవన్‌, గాంధీ రోడ్‌, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఐబి చౌరస్తాల మీదుగా గీతాభవన్‌ వరకు ప్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిపిలు లక్ష్మీనారాయణ రాజు, ఎసిపిలు నరేందర్‌, కరుణాకర్‌, విజయ్‌ కుమార్‌, మాదవి, విజయ్‌ కమార్‌, సిఐలు, ఎస్‌ఐలు పాల్గోన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు