Tuesday, April 30, 2024

నేటి నుంచి సఫారీ గడ్డపై తొలిటెస్ట్‌

తప్పక చదవండి
  • ఊపువిూదున్న రోహిత్‌ సేన గత చరిత్రను తిరగరాయాలన్న పట్టుదల

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాతో మరోసారి టెస్టు సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. సఫారీ గడ్డపై ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేకపోయిన భారత జట్టు.. ఈసారి చరిత్ర తిరగరాయాలనే పట్టుదలతో ఉంది. మంగళవారం నుంచి టెస్ట్‌ క్రికెట్‌ జరుగనుంది. అప్పుడు తొలి మ్యాచ్‌ గెలిచి మూడు టెస్టుల సిరీస్‌లో 10తో ఆధిక్యంలో నిలిచిన భారత్‌.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో తడబడి ఓటమి పాలైంది. మరి ఈసారి దాదాపు పూర్తిగా మారిన జట్టుతో, కొత్త ఉత్సాహంతో రెండు టెస్టుల సిరీస్‌లో అడుగుపెడుతున్న భారత్‌ సిరీస్‌ విజయంతో చరిత్ర సృష్టించాలని చూస్తోంది. సెంచూరియాన్‌ వేదికగా డిసెంబర్‌26 నుంచి దక్షిణాఫ్రికాభారత్‌ తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం దక్షిణాఫ్రికా,భారత జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. తమ సొంత గడ్డపై టెస్టుల్లో భారత్‌పై అధిపత్యాన్ని చెలాయించాలని సౌతాఫ్రికా భావిస్తుంటే.. టీమిండియా మాత్రం తొలిసారి సఫారీ గడ్డపై టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కసితో ఉంది. ఈ సిరీస్‌కు టీమిండియా ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి అందుబాటులో ఉన్నారు. వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత ఈ సీనియర్‌ ద్వయంకు ఇదే తొలి ద్వైపాక్షిక సిరీస్‌ కావడం గమనార్హం. ఇప్పటివరకూ ఆ దేశంలో ఎనిమిదిసార్లు టెస్టు సిరీస్‌ ఆడిన మన జట్టు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. చివరగా 202122 సిరీస్‌లో దక్షిణాఫ్రికాలో భారత్‌ ఆడిరది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు జట్టులో ఎన్నో మార్పులు జరిగాయి. కొత్త ఆటగాళ్లు వచ్చారు. ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో సఫారీ సవాలుకు భారత్‌ సై అంటోంది. 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి తప్పుకున్నాడు. వన్డేల్లో, టెస్టుల్లో సారథిగా కొనసాగాలనుకున్నాడు. కానీ టీ20లతో పాటు వన్డేల్లోనూ ఒకరే కెప్టెన్‌ ఉండాలనుకున్న బీసీసీఐ ఆ బాధ్యతలను రోహిత్‌కు అప్పగించింది. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లి గుడ్‌బై చెప్పి షాకిచ్చాడు. భారత జట్టు కెప్టెన్‌గా పూర్తిగా తప్పుకున్నాడు. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ రోహిత్‌ కెప్టెన్సీ కెరీర్‌ ఆరంభమైంది. ఇప్పుడు మళ్లీ దక్షిణాఫ్రికాతో టెస్టుల కోసం అక్కడికి వెళ్లిన కోహ్లి.. ఇప్పుడు కేవలం ఆటగాడిగానే ఆడబోతున్నాడు. 202122 టెస్టు సిరీస్‌తో పోలిస్తే ఇప్పుడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న జట్టులో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా సీనియర్‌ ఆటగాళ్లు చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె ఇద్దరూ లేకుండా భారత టెస్టు జట్టు సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఈ ఇద్దరు టెస్టు స్పెషలిస్టు బ్యాటర్లలో ఒక్కరు కూడా జట్టులో లేకుండా భారత్‌ విదేశాల్లో టెస్టు ఆడ బోతుండటం గత దశాబ్ద కాలంగా ఇదే మొదటిసారి. ఈ ఇద్దరు లేకుండా భారత్‌ దక్షిణాఫ్రికాలో సిరీస్‌ ఆడబోతుండటం కూడా 2006 తర్వాత ఇదే తొలిసారి. టెస్టు అరంగేట్రం తర్వాత దక్షిణా ఫ్రికాలో టెస్టు సిరీస్‌కు పుజారా, రహానె దూరమవడం ఇదే మొదటిసారి. 2022లో సొంతగడ్డపై శ్రీలంకతో సిరీస్‌లో రెండు టెస్టుల్లో ఈ ఇద్దరికీ చోటు దక్కలేదు. కానీ తిరిగి పుంజుకుని వీళ్లు జట్టులోకి వచ్చారు. అయితే ఇప్పుడేమో దక్షిణాఫ్రికా సిరీస్‌ కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. దక్షిణాఫ్రికాలో గత భారత జట్టు టెస్టు సిరీస్‌తో పోలిస్తే ఈ సారి జట్టులో చాలా కొత్త ముఖా లున్నాయి. తొలి టెస్టు తుది జట్టులో ఉన్న వాళ్లలో కేఎల్‌ రాహు ల్‌, కోహ్లి, అశ్విన్‌, శార్దూల్‌, బుమ్రా, సిరాజ్‌ మాత్రమే ఇప్పుడూ జట్టుతోనూ ఉన్నారు. వీళ్లతో పాటు యశస్వి జైస్వాల్‌, కేఎస్‌ భరత్‌, ముకేశ్‌ కుమార్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ కొత్తగా జట్టుతో చేరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు