Tuesday, May 21, 2024

సపారీతో టెస్టులోతొలిసారి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ

తప్పక చదవండి
  • విజయం కోసం కృషి చేస్తామని వెల్లడి

న్యూఢిల్లీ : వన్డే వరల్డ్‌కప్‌`2023 తర్వాత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టును రోహిత్‌ నడిపించనున్నాడు. సఫారీ గడ్డపై ఇప్పటివరకు అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్‌ను.. ఈ సారి సొంతం చేసుకుని తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకోవాలని హిట్‌మ్యాన్‌ పట్టుదలతో ఉన్నాడు. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు డిసెంబర్‌ 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రీమ్యాచ్‌ కాన్ఫెరెన్స్‌లో రోహిత్‌ పాల్గొన్నాడు. ప్రపంచ కప్‌ ఓటమి గురించి రోహిత్‌ శర్మను మరోసారి విలేకరులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ మాట్లాడుతూ.. ’ప్రపంచకప్‌లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ట్రోఫీ కోసం చాలా చాలా కష్టపడ్డాము. ఫైనైల్‌ మ్యాచ్‌లో మేము కొన్ని విభాగాల్లో రాణించలేక పోయాం. ఆఖరిపోరులో ఓడిపోవడం చాలా బాధ కల్గించింది. కానీ ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు పోవడానికి కొత్త దారులు వెతకాలి. ఓటమి తర్వాత చాలా మంది మాకు మద్దతుగా నిలిచారు. అది వ్యక్తిగతంగా నన్ను ఓటమి బాధ నుంచి కోలుకునేలా ప్రేరేపించింది. ప్రస్తుతం నా దృష్టి సౌతాఫ్రికా సిరీస్‌ పైనే ఉంది. పరిస్ధితులు ఎలా ఉన్న నేను బాగా బ్యాటింగ్‌ చేయడానికి 100 శాతం ప్రయత్నిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రోటీస్‌ సిరీస్‌లో రోహిత్‌తో పాటు స్టార్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, జస్పీత్ర్‌ బుమ్రా కూడా భాగమయ్యారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు