Thursday, May 2, 2024

ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఫెరారీ కార్లు

తప్పక చదవండి

బెంగళూరు : బెంగళూరు మహానగరం ట్రాఫిక్‌కు పేరుగాంచింది. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్‌ కష్టాలను సోషల్‌ విూడియా ద్వారా పంచుకుంటుంటారు. అలా, బెంగళూరు ట్రాఫి క్‌కు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్‌ అయింది. ఆ వీడియోలో ఎంతో విలాసవంతమైన ఫెరారీ సూపర్‌ కార్లు ట్రాఫిక్‌లో వరుస కట్టాయి. స్థానిక చర్చ్‌ స్టీట్ర్‌ బెల్‌ రోడ్‌లో సుదీర్ఘ ట్రాఫిక్‌ జామ్‌ మధ్య లో సుమారు 10కిపైగా ఫెరారీ కార్లు ఒకదాని వెనుక చిక్కుకుపోయాయి. కాగా, సిలికాన్‌ వ్యాలీ గా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రోజురోజుకూ నగరంలో ట్రాఫిక్‌ పెరిగిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. ముఖ్యంగా ఉద్యోగులు, పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల బాధలు వర్ణనాతీతం.ప్రపంచం లో ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే నగరాల్లో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరులో 2`3 కిలోవిూటర్ల ప్రయాణానికి గంటల సమయం పడుతోంది. పని విూద బయటకు వెళ్లాలంటనే ట్రాఫిక్‌ బారులను చూసి పౌరులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలకు అద్దం పట్టే ఘటనలు ఇప్పటికే సోషల్‌ విూడియాలో అనేకం వెలుగులోకి వచ్చాయి. సుదీర్ఘ ట్రాఫిక్‌ జామ్‌ను తప్పించుకునేందుకు అనేకమంది నగర వాసులు మెట్రో రైలు వంటి పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను అనుసరిస్తున్నారు. నగరంలోని 95 శాతం మంది వాహనాల యజమానులు కూడా ఇదే చెబుతున్నారని ఇటీవలే స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు