Saturday, May 4, 2024

యుద్ధం వేళ సైనికుల వీర్య సేకరణ !

తప్పక చదవండి

జెరూసలెం : ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధంలో తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్‌లో 1400 మంది చనిపోగా.. గాజాలోనూ 10వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులు, సామాన్య యువకుల వీర్యాన్ని సేకరించేందుకు బాధిత కుటుంబీకులు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. తమ వాళ్లు చనిపోయిన విషయం తెలిసిన వెంటనే వారు వైద్య నిపుణులను సంప్రదిస్తున్నారు. తాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి 33 మంది నుంచి సేకరించినట్లు స్పెర్మ్‌ బ్యాంక్‌లు వెల్లడిరచాయి. ఈ క్రమంలో దీనిలో ప్రస్తుతమున్న కొన్ని నిబంధనలను కూడా ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తాజాగా సడలించడం గమనార్హం. శిథిలాల్లో చిక్కుకుపోయిన శవాల ఆచూకీ తెలుసుకునేందుకు ఇజ్రాయెల్‌ అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపడుతున్నారు. గద్దలు, రాబందుల సాయంతో ఎక్క డెక్కడ మృతదేహాలు ఉన్నాయో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆపరేషన్‌లో పాలుపంచుకున్న అటవీశాఖ నిపుణుడు ఒహాడ్‌ హట్జోఫే విూడియాకు వెల్లడిరచారు. గద్దలు, రాబం దుల కాళ్లకు జియోట్యాగ్‌లు కట్టి.. వాటిని బయటకు వదులుతున్నామని, అవి కుళ్లిపోయిన శవాలు ఉండేచోట వాలుతుంటే జియోట్యాగ్‌ ఆధారంగా గుర్తిస్తున్నామని తెలిపారు. తొలుత ఇజ్రాయెల్‌ సైనికుల ఆచూకీని గుర్తించేందుకు ఈఐటీఏఎన్‌ యూనిట్‌ ఈ విధానాన్ని అనుసరించేది. భవిష్యత్తులో గర్భధారణకు వీలుగా చనిపోయిన వ్యక్తి నుంచి వీర్య కణాలను సేకరిస్తారు. ఈ విధానాన్ని మరణాంతర వీర్య సేకరణ అంటారు. వ్యక్తి మరణించిన 24 నుంచి 36 గంటల్లోనే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని అతిశీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. అవసరమైనప్పుడు ఇంట్రాసైటోఎªలాస్మిక్‌ స్పెర్మ్‌ ఇంజెక్షన్‌ (ఐవీఎఫ్‌ తరహా ) విధానంలో గర్భధారణకు ప్రయత్నిస్తారు. అయితే, ఆ వీర్యం మరణించిన లేదా సజీవంగా ఉన్న వారి నుంచి సేకరించినా ఐవీఎఫ్‌ విజయావకాశాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ నిబంధనల ప్రకారం, పెªలళైన, పెళ్లి కాని వ్యక్తుల నుంచి వీర్యాన్ని సేకరించవచ్చు. అయితే, వివాహం కాని యువకుడైతే అందుకు అక్కడి ఫ్యామిలీ కోర్టు అనుమతి తప్పనిసరి. అదే పెªలళైన వ్యక్తి విషయానికొస్తే భార్య అభ్యర్థన మేరకు వీటిని సేకరించాల్సి ఉంటుంది. కానీ, మరణించిన వారి నుంచి వీటిని సేకరించడం సవాలుతో కూడుకున్న పని. అయితే, పెళ్లి కాని యువకుల నుంచి కోర్టు అనుమతి తప్పనిసరి నిబంధనను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సడలించింది. అంతేకాకుండా ఇటువంటి వారికి సాయం చేసేందుకు నాలుగు స్పెర్మ్‌ బ్యాంకులు 24గంటల పాటు పనిచేసేలా ఐడీఎఫ్‌ నుంచి ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేసింది.కాగా, యుద్ధం మొదలైనప్పటి నుంచి చనిపోయిన 33 మంది యువకుల వీర్యాన్ని సేకరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరిలో నలుగురు సాధారణ పౌరులు కాగా.. 29 మంది సైనికులు ఉన్నారు. కేవలం కుటుంబీకులే కాకుండా పిల్లల కోసం ప్రయత్నించే ఎంతో మంది మహిళలు వీర్య దాతల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సాధారణంగా రంగు, ఆకృతి, దేహ దారుఢ్యం కలిగిన వ్యక్తుల కంటే దేశం కోసం పోరాడే సైనికుల వీర్యానికే స్థానికంగా భారీ డిమాండు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా అక్కడ కృత్రిమ గర్భధారణకు ప్రయత్నించే మహిళల్లో ఎక్కువగా సైన్యంలో (ఐడీఎఫ్‌) సేవలందించేవారికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్థానిక స్పెర్మ్‌ బ్యాంకులు గతంలో పేర్కొన్నాయి. అక్కడ దాతలుగా నమోదు చేసుకున్న వారిలో ఎక్కువగా సైన్యంలో పనిచేసిన వారేనని తెలిపాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు