Tuesday, May 14, 2024

కమిషనరే కాళకేయుడు

తప్పక చదవండి

సీతారామచంద్రుల దేవాలయ భూమి దోపిడీదారుల వశం

  • కార్పోరేట్‌ కంపెనీలకు కట్టబెట్టిన ఎండోమెంట్‌ శాఖ
  • అసలైన రైతులకు టోకరా..
  • చేసేదేమి లేక లొంగిపోయిన అన్నదాతలు
  • వందల ఎకరాల్లో మోసం జరిగిందన్న రైతులు
  • ఆలయ భూమిలో హెచ్‌ఎండీఏ లేఅవుటా..!
  • ప్రేక్షక పాత్రలో ఎండోమెంట్‌ కమిషనర్‌ వి.అనిల్‌ కుమార్‌
  • ఇది ప్రజా ఉపయోగార్థం ఎలా అవుతుందన్న స్థానికులు

రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలం, సీతారామపుర్‌ గ్రామానికి చెందిన సీతారామచంద్రుల పేరనున్న దేవాలయ భూమి దోపిడీదారుల పాలవుతుంది. కొన్ని వందల ఏళ్లుగా గుడిని, ఆ గుడి పేరుమీద ఉన్న భూమిని నమ్ముకుని బతుకుబండిని లాగుతున్న రైతులకు గత ప్రభుత్వం, దేవాదాయ కమీషనర్‌ వి. అనీల్‌కుమార్‌ లు కలిసి కుచ్చు టోపి పెడుతోంది. అక్కడి రైతులకు ఏదో మాయమాటలతో, నచ్చచెప్పి కొంత పరిహారం ఇస్తామని, అదే భూమిని కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతుంది.

- Advertisement -

అస్సలు కథ ..
సీతారాముల గుడిపేరు మీద ఉన్న సర్వే నెం. 1663 నుంచి 1673 వరకు 1,148 ఎకరాల 12 గుంటల భూమిలో రైతులకు కౌలుకు ఇచ్చింది 900 ఎకరాలు మాత్రమే. ఇంకా 248 ఎకరాల 12 గుంటల భూమిలో కొంత ఆ గ్రామం, రోడ్లు, చెరువులు, కాలువలు, గుట్టలు, సమాదులు ఉన్నాయి. కాని ప్రభుత్వం మాత్రం 11 వందల ఎకరాల భూమికి పరిహారం ఇస్తున్నట్లు లెక్కల్లో స్పష్టమవుతుంది. అయితే ప్రభుత్వం ఇస్తున్న నష్ట పరిహారం ఎకరానికి రూ. 21 లక్షలు, దేవాదాయ భూమి కాబట్టి సగం అంటే రూ. 10 లక్ష 50 వేలు దేవాదాయ శాఖకు, రూ. 10 లక్ష 50 వేలు రైతులకు ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది.

దేవాదాయ శాఖ కమీషనర్‌ పనితీరు..
రాముడు దిగిరాడు.. రైతులు ప్రశ్నించలేరు అనే ధైర్యంతో కొన్ని తరాలు ఆ భూమిపై ఆదారపడి జీవిస్తున్న రైతుల పొట్ట గొట్టి, రక్షించేవాడే భక్షించినట్లు దేవాలయ భూములు కాపాడే అధికారి అక్రమాలకు పాల్పడి, డబ్బులకు లొంగిపోయారని గ్రామస్థులు వాపోతున్నారు.

ఆఫీసుల చుట్టు తిరుగుతున్న రైతులు
ఆ రాముడు పెట్టిన శాపమో.. లేక సీతారాముల గుడి అధికారి చేసిన పాపమో కానీ అసలైన రైతులు ప్రతీ రోజూ తహసిల్దార్‌ కార్యాలయానికి అక్కడి నుండీ ఆర్డీవో కార్యాలయానికి ఇలా ప్రతీరోజు తిరిగీ తిరిగీ.. చేసేదేమి లేక దేవాదాయ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు లొంగిపోయి, వారు ఇచ్చే కాస్త పరిహారానికి లొంగిపోయారు. ఎందుకంటే వీళ్లు తాతలనాటి నుంచి ఇప్పటివరకూ అదే భూమిపై ఆధార పడి బతుకుతున్నారు. ప్రభుత్వం భూమిని సేకరించే ముందు, ఆ భూమిని సర్వే చేసింది ఎవరు? ఎంత భూమి సాగుచేస్తున్నారో లెక్క తీసి వారికి రావల్సీన భూమిని బట్టి పరిహారం అందిస్తుంది. అయితే ఈ దేవాలయ భూముల సర్వే విషయంలో కొంత అవకతవకలు జరిగాయి. దాన్ని సరి చేసుకోవాడానికి బాధిత రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, రెవెన్యూ అధికారులకు కనికరం లేదు. కనీస మానవత్వంతో ఆలోచన చేయడం లేదు. అధికారులు ఆఫీసులకే సరిగా రావడం లేదు, రైతులు ఆఫీసుకు ఎప్పుడు వచ్చినా సారు సీటులో లేరనే సమాధానమే ఎదురవుతుంది. సరే అవసరం రైతులది కాబట్టి ఫోన్‌ చేసి అడిగితే, వచ్చే జవాబు ఈ రోజు రాలేదు, రేపు వస్తానని చెప్పడంతో పనికావడం లేదన్న ఆవేదనతో రైతులు వెనుతిరిగి వెళ్తున్నారు. తరువాతి రోజూ కూడా ఇదే తంతు. ఇలా నెలలుగా ఈ పర్వం కొనసాగుతూనే ఉంది.

అనుమతించని దేవాదాయం
2018 నుంచి దేవాలయ భూమిని ఎలా తెగనమ్ముకోవాలా అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం, రైతులకు ఇస్తున్న నష్ట పరిహారం విషయంలో ఎన్నో చర్చలు, ధర్నాలు, మీటింగులు పెట్టినా కాలయాపనకె తప్ప ఎలాంటి పరిష్కార దిశగా ప్రభుత్వం అడుగులు వేయలేదు. దేవాలయ భూమిని ప్రభుత్వం ప్రజా ఉపయోగార్థం సేకరించాలంటే ఎండోన్మెంట్‌ శాఖ చట్ట ప్రకారం ఆ శాఖ నుండి పూర్తి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, దేవాదయ శాఖను మాత్రం ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వం సంప్రదించలేదు. ఆ శాఖ ఇందుకు అనుమతించ లేదు. ప్రభుత్వం ఇస్తున్న పరిహారం సగం రైతులకు, సగం దేవాదాయ శాఖకు అని చెప్పుకుంటూ వస్తున్నారే తప్పా, రాత పూర్వకంగా ఎలాంటి కాగితం కూడా దేవాదాయ శాఖకు ఇవ్వలేదని సీతారాముల గుడి అధికారి ఈవో అంటున్నారు.

ఇప్పటికైనా ఈ విషయంపై తెలంగాణ నూతన ప్రభుత్వం దృష్టి సారించి రంగారెడ్డి జిల్లా, షాబాద్‌ మండలం, సీతారామపుర్‌ గ్రామానికి చెందిన సీతారామచంద్రుల ఆలయానికి సంబందించిన వందల ఎకరాల భూమిని కాపాడాలని, రామచంద్రుని రాక్షసుల పాలు అవడానికి లోపాయకారి ఒప్పదం చేసుకొని సహకరించిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, ఎండోన్మెంట్‌ కమీషనర్‌ వి. అనిల్‌ కుమార్‌, సంబంధింత అధికారులపై వెంటనే శాఖ పరమైన చర్యలు తీసుకోని, ఈ విషయంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌
ద్వారా దర్యాప్తు చేయించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్న నాయకుల, అధికారుల వివరాలను మరిన్నీ పూర్తి ఆధారాలతో మీముందుకు తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌.. మా అక్షరం అవినీతి పై అస్త్రం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు