- భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం
- నీటమునిగిన ఎయిర్ పోర్టు
- విమానరాకపోకలు రద్దు
- గోడకూలిన ఘటనలో ఇద్దరు మృతి
- పాఠశాలలకు సెలవుల ప్రకటన
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ప్రభుత్వం
చెన్నై : తుఫాన్ ప్రభావంతో చెన్నైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. నగరమంతా వరదలు ముంచెత్తుతున్నాయి. మిగ్జాం తుఫాన్ కారణంగా తమిళనాడు తీర ప్రాంతాల్లో గట్టి ప్రభావం కనిపిస్తోంది. ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద నీళ్లు చేరుకున్నాయి. కొన్ని చోట్ల తుఫాన్ ధాటికి చెట్లు కూలిపోయి నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. మరి కొన్ని చోట్ల కార్‌లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రైళ్ల షెడ్యూల్ పూర్తిగా మారిపోయింది. కొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. రోడ్లపై నీళ్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. అపార్ట్‌మెంట్‌లోలని సెల్లార్‌లలో వరద నీళ్లలో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. చాలా చోట్ల ఈదురు గాలులు వీస్తున్నాయి. భవనాలు కుప్ప కూలిపోతున్నాయి. చెన్నై విమానాశ్రయం నీట మునిగింది. దీంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు. అలాగే పలు విమానాయాన సంస్థలు రద్దుచేశాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కనాథుర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన
వర్షపాతం నమోదవుతుందని వెల్లడిరచింది. తిరవళ్లూరు, చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో వచ్చే మూడు గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రణిప్పెª`టటై, వేలూరు, తిరపత్తూరు, ధర్మపురి, నమక్కల్, తిరువరూర్, నాగపట్టిణం, తమిళనాడు, పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, మచిలీపట్నంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఎఓఆ వెల్లడిరచింది. చెన్నైలో మీనంబక్కంలో 196 ఓఓ వర్షపాతం నమోదైంది. నుంగబక్కంలో 154.3 ఓఓ వర్షపాతం రికార్డ్ అయింది. ఈ వానల కారణంగా చెన్నైలోని స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీస్‌లు మూసివేశారు. ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని సూచించింది ప్రభుత్వం. తీరప్రాంతాల్లో దాదాపు 5 వేల రిలీఫ్ సెంటర్‌లు ఏర్పాటు చేశారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యల్ని పరిశీలిస్తున్నారు. ’మిగ్జాం తుఫాన్‌ని ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది. మంత్రులతో పాటు ఉన్నతాధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉన్నారు. అధికారులు చెప్పిన జాగ్రత్తలు ప్రజలందరూ పాటించాలి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు. ఈ తుఫాన్ ప్రభావం తగ్గిపోయేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని స్టాలిన్ సూచించారు.