Monday, April 29, 2024

బద్దలైన మరాపి అగ్నిపర్వతం..

తప్పక చదవండి
  • 11 మంది మృతి.. మరో 12 మంది గల్లంతు..
  • సుమత్రా దీవిలో విస్ఫోటనం
  • విగత జీవుల్లా పర్వతారోహకులు
  • మూడు కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద

ఇండోనేషియాలోని మరాపి అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మందికి పైగా గల్లంతయ్యారు. ఎలాంటి అలజడి లేకుండా ఒక్క సారిగా ఈ అగ్నిపర్వతం బద్దలైంది. మొత్తం 26 మందితో కూడిన పర్వతారోహకుల బృందంలో చాలా మంది గల్లంతయ్యారు. అయితే, అధికారులు ఈ బృందంలో ముగ్గురిని కాపాడగలిగారు. మౌంట్‌ మరాపి ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా బద్దలవడంతో ప్రాణనష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఇది చోటు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతంలో 75 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో ఆకాశంలోకి 3 కిలోమీటర్ల ఎత్తున బూడిద ఆవరించింది. అగ్నిపర్వత శకలాలు సమీప గ్రామాలపై పడ్డాయి. పసిఫిక్‌ ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ జోన్‌ లో ఉన్న ఇండోనేషియాలో అత్యధికంగా 130 క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆ ప్రాంతంలో తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడిరచారు. ఘటన తీవ్రత నేపథ్యంలో మౌంట్‌ మరపి ప్రాంతంలో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు