Sunday, May 5, 2024

సమరానికి…సై

తప్పక చదవండి
  • మొదలైన ఎన్నికల వేడి
  • 84బూతులు…12లెక్కింపు కేంద్రాలు
  • పోటీలో 13యూనియన్లు – 39,809మంది ఓటర్లు

కొత్తగూడెం : తెలంగాణరాష్ట్రానికి తలమానికమైన, కష్టంతోపాటు దేశానికి వెలుగునందిస్తున్న ప్రభుత్వరంగ సంస్థ అయిన సింగరేణిలో ఎన్నికల వేడి ఊపందుకుంది. సింగరేణి సంస్థలో 1998నుంచి ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నారు. నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఎన్నికలు తర్వాత రెండు సంస్థల్లోకి ఓసారి నిర్వహించడం మొదలుపెట్టారు. 2017లో సంస్థలు ఎన్నికలు జరగగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలుమార్లు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి కారణాలను చూపుతూ పలుమార్లు ఎన్నికలు వాయిదా పడేందుకు కారణమైంది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్‌ప్రభుత్వం సైతం ఎన్నికల నిలిపివేతకు హైకోర్టు మెట్లనెక్కి విఫలమైంది.ఈనెల 21న ఎన్నికల అధికారులు ఇచ్చిన తేదీ ప్రకారం సింగరేణి సంస్థలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం వేసిన పిటీషన్‌ కొట్టివేసింది. దీంతో సింగరేణి సంస్థలో ఎన్నికల వేడిప్రారంభమైంది.మొత్తం 12ఏరియాలలో 39,809మంది ఓటర్లు ఉండగా 84బూతులను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల అధికారులు ఈమేరకు అన్ని ఏర్పాట్లను చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఎన్నికల అధికారులు ఆదేశించారు. దీంతో అధికారులు బూతుల ఏర్పాట్లు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అదే విధంగా ఎన్నికలు పూర్తవ్వగానే సాయంత్రానికి లెక్కింపు ప్రక్రియ కోసం మొత్తం 12ఏరియాలలో 12కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం సింగరేణి వ్యాప్తంగా 13యూనియన్లు ఎన్నికల బరిలో నిలువగా అన్ని యూనియన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇలా ఉండగా కార్పోరేట్‌ ఏరియాలో 1,191, కొత్తగూడెం ఏరియాలో 2331, ఇల్లందు ఏరియాలో 613, మణుగూరు ఏరియాలో 2452, రామగుండంఏరియాలో1లో 5404, రామగుండం ఏరియా2లో 3557, ఏరియా3లో 3884ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. అదే విధంగా భూపాలపల్లి ఏరియాలో 5395, బెల్లంపల్లి ఏరియాలో 998, మంద మర్రిలో 4835, శ్రీరాంపూర్‌లో 9149 ఓటర్లు యూనియన్ల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.ఈ సింగరేణి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా యూనియన్లు పావులు కదుపుతూ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మరి సింగరేణి కార్మికులు ఏయూనియన్‌కు పట్టం కడతారో వేచి చూద్ధాం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు