Tuesday, May 7, 2024

కాంగ్రెస్‌ మంత్రుల్లో అహంభావం కన్పిస్తోంది

తప్పక చదవండి
  • కిషన్‌ రెడ్డి.. బీఆర్‌ఎస్‌ బినామీ అన్న మంత్రులకు కౌంటర్‌
  • కొందరు మంత్రుల్లో అహంభావం కనిపిస్తోందని ఆగ్రహం
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే.. అధికారంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరిం చిన తీరు గుర్తుకొస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. కొందరు మంత్రుల్లో అప్పుడే అహంభావం కన్పిస్తోందని, ఇష్టమొచ్చి నట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కిషన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ బినామీ అంటూ పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా బండి సంజయ్‌ పై విధంగా స్పందించారు. ‘ఎవరికి ఎవరు కోవర్టో, ఏ పార్టీ నేతలు.. ఇతర పార్టీ నేతలతో రహస్యంగా కలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసు..’’అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలకు అద్రుష్టం ఉన్నందునే అధికారంలోకి వచ్చారే తప్ప ఆ పార్టీ నేతలు చేసిన పోరాటాలేమీ లేవని అన్నారు. ‘’అసలు మీరు ఎవరి కోసం కొట్లాడారు? ఏనాడ్కెనా నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళల పక్షాన ఉద్యమాలు చేశారా?’’అని ప్రశ్నించారు. కొద్దిసేపటి క్రితం బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌ లోని బోయినిపల్లి అనురాధ టింబర్‌ డిపోను సందర్శించారు. ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, మహంకాళి జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్‌, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.ప్రకాశ్‌ రెడ్డి, సీనియర్‌ నేత రామక్రిష్ణ, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజేందర్‌ తదితరులతో కలిసి టింబర్‌ డిపోలో రామ మందిర నిర్మాణానికి అవసరమైన ద్వారాలు, కిటికీలు, ఇతర కలప వస్తువుల తయారీని పరిశీలించారు. ఈ సందర్భంగా టింబర్‌ డిపో యజమానులు శరత్‌, కిరణ్‌ లను ఘనంగా సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈనెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతోంది. దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం పూర్తయింది. ఆదర్శ రాములు, అందాల రాముడు పుట్టిన గడ్డ అయోధ్య అని చరిత్ర చెబుతోంది. ప్రతి హిందువు సహకారంతో, విరాళాలతో రామ మందిర నిర్మాణం పూర్తయ్యింది. అందులో భాగంగా మందిర నిర్మాణానికి అవసరమైన ద్వారాలు, కిటికీలు అనురాథ టింబర్‌ డిపో నిర్వాహకులు శరత్‌, కిరణ్‌ గత ఏడాది కాలంగా వీటిని తయారు చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చాను. దాదాపు 80 మంది కార్మికులతో కలిసి 6 నెలలుగా పనులు చేస్తున్నారు. ఇంత గొప్ప మహత్కార్యం చేస్తున్న నిర్వాహకులకు అభినందనలు. ఇది బీజేపీ కార్యక్రమం కాదు.. రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనే కార్యక్రమం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తోపాటు దేవుడినే నమ్మని కమ్యూనిస్టు పార్టీల నేతలు కూడా భక్తిభావం పెరిగి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమైనరు. దయచేసి దీనిని రాజకీయం చేయొద్దు. కానీ ఒవైసీ అనే మూర్కుడు దీనిని రాజకీయం చేసి లబ్ది పొందాలని చూస్తున్నడు. ముస్లిం సమాజం ఎంఐఎంకు దూరమవుతుందనే అక్కసుతో యువతను రెచ్చగొట్టాలని చూస్తున్నడు. ముస్లిం మతపెద్దలు కూడా రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. ఫరూక్‌ అబ్దుల్లా వంటి నేత కూడా శ్రీరాముడు దేశానికే కాదు.. ప్రపంచానికి దేవుడని కీర్తిస్తున్నారంటే అర్ధం చేసుకోవాలి. కానీ ఎంఐఎం నేతలు సుప్రీం తీర్పు వచ్చిన సమయంలో గొడవలు జరగాలని కోరుకున్నరు. ఒవైసీ.. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ముస్లిం సమాజం సిద్ధంగా లేదు. నీ మాటలు వినే రోజులు పోయాయి. రామ మందిర నిర్మాణం కోసం చాలా చోట్ల ముస్లిం పెద్దలు వచ్చి స్వయంగా విరాళాలు ఇచ్చిన సంగతిని గుర్తుంచుకోవాలి. కొందరు మంత్రుల ముఖ కవళికలు, వాళ్లు వాడుతున్న భాషను చూస్తుంటే… అధికారంలో బీఆర్‌ఎస్‌ నేతలు వ్యవహరించిన తీరు గుర్తుకొస్తోంది. వారిలో అప్పుడే అహంభావం కన్పిస్తోంది. ఎవరికి ఎవరు కోవర్టో ప్రజలందరికీ తెలుసు.. మీకు అద్రుష్టం ఉంది కాబట్టే అధికారంలోకి వచ్చారు. అసలు మీరు ఎవరి కోసం కొట్లాడారు? ఏనాడ్కెనా నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు, మహిళల పక్షాన ఉద్యమాలు చేశారా? కాంగ్రెస్‌ నేతలకు నా విజప్తి ఒక్కటే.. మొన్ననే మీ ప్రభుత్వం ఏర్పడిరది. మీ మీద మాకు కోపం లేదు. ఎందుకంటే కేసీఆర్‌ మూర?త్వ పాలన పీడ విరగడ్కెంది. ఆ కుటుంబ రాజ్యం పోయంది. బీఆర్‌ఎస్‌ వేర్లు ఇంకా ఉన్నయ్‌. వాటిని కూకటి వేళ్లతో పెకిలించబోతున్నం. రాష్ట్రంలో కాంగ్రెస్‌, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణ అభివ్రుద్ధి ద్రుష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి. ఏ ప్రభుత్వం ఏర్పడినా సహకరించేందుకు సిద్ధమని ప్రధాని మోదీ పదేపదే చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఆ తరువాత అభివ్రుద్ధే ముఖ్యమని అన్నారు. అయినా కాంగ్రెస్‌ నేతలు రాజకీయాలు చేయడం సరికాదు. కాంగ్రెస్‌ నేతలు అధికారంలోకి వచ్చా మనే నిజం నుండి ఇంకా తేరుకోలేకపోతున్నరు. గిచ్చి చూసు కుంటున్నట్లున్నారు.. మా టార్గెట్‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌. బీఆర్‌ఎస్‌ ను కూకటి వేళ్లతో పెకిలించేదాకా విశ్రమించబోదు. కానీ కాంగ్రెస్‌కు బీజేపీ టార్గెట్‌. అందుకే బీజేపీనే లక్ష్యంగా చేసుకుంటోంది. కాళేశ్వరంపై విచారణ చేసే అధికారం రాష్ట్రానికి ఉంది. దమ్ముంటే విచారణ చేసుకోవాలి తప్ప బీజేపీపై నెపం మోపడం ఎందుకు? నేను పార్టీ కార్యకర్తను. ఎక్కడ పోటీ చేయాలని ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తా. అసలు పోటీ చేయనే వద్దు. కార్యకర్తగా పనిచేయాలని ఆదేశిస్తే.. తప్పకుండా శిరసావహించి పనిచేస్తా. కొంతమంది ఫాల్తుగాళ్లు, లుచ్చాగాళ్లు బరితెగిస్తున్నరు. గోవును పూజిస్తుంటే తీసుకుపోయి వధిస్తున్నరు. నేను అధికారంలో ఉండి ఉంటే అట్లాంటి లుచ్చాగాళ్లకు పబ్లిక్‌ లోనే పనిష్మెంట్‌ ఇచ్చేవాళ్లం. ఇంట్లో గోమాతను పూజిస్తుంటే.. ఆ గోమాతను తీసుకుపోయి వధించి తింటారా? ఇట్లాంటి ఫాల్తుగాళ్లను వదిలేస్తారా? రోడ్డు మీదకు గుంజుకొచ్చి వాళ్ల సంగతి చెప్పాలి. హిందువులారా, గోమాత రక్షకులారా ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్‌ హయాంలో కూడా గోమాతలకు రక్షణ లేకుండా పోయింది. గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయడం లేదు. హిందువులకు కూడా రక్షణ లేకుండా పోయింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు