Friday, May 3, 2024

డీఎంఈ రమేష్‌రెడ్డి జంప్‌..!

తప్పక చదవండి
  • రాజీనామా చేసి తప్పుకునే యత్నం
  • కొత్త సర్కార్‌ చర్యలు తీసుకుంటుందనే వణుకు..!
  • వరంగల్‌ సెంట్రల్‌ జైలు మార్టిగేజ్‌ స్కాంలో డా.కే. రమేష్‌రెడ్డిదే కీలక పాత్ర..!
  • అవినీతి జలగలు ఒక్కొక్కటిగా మెల్లగా
    తమ భాద్యతల నుండి జారుకుంటున్న వైనం

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): కాంగ్రెస్‌ సర్కార్‌ కొలువుదీరడం,రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పరిపాలనలో దూకుడుగా వెళుతుండడంతో..కేసీఆర్‌ ప్రభుత్వ హయంలో ఆయన కందాన్‌ ఆస్తులు పొగేసుకోవడానికి రెండు చేతల సహకరించిన అవినీతి జలగలు ఒక్కొక్కటిగా మెల్లగా తమ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయి. అందులో భాగంగానే మొన్న ఇంటెలిజెన్స్‌ ఓఎస్‌డీ ప్రభాకర్‌ రావు,జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావులు రాజీనామా చేయగా..ఇప్పుడు అదే బాటను డీఎంఈ కె.రమేష్‌ రెడ్డి అనుసరిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ ఓఎస్డీ ప్రభాకర్‌ రావు,జెన్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావులిద్దరూ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన చేసిన అసంబద్ధ పనులకు వారి సంపూర్ణ సహకారం అందించగా.. ఢీఎంఈ కె.రమేష్‌ రెడ్డి ఏకంగా వరంగల్‌ సెంట్రల్‌ జైలునే బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు తాకట్టు పెట్టి రూ.1,100 కోట్లకు మార్టిగేజ్‌ చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇందుకోసం మొదటగా తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కొర్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరుతో కేసీఆర్‌ సర్కార్‌ అప్పట్లో ఒక కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేసింది. ఇందుకు డీఎంఈ రమేష్‌ రెడ్డిని డైరెక్టర్‌ గా అపాయింట్‌ చేసింది. ఈయనతో పాటు మరికొంత మందిని డైరెక్టర్లుగా కేసీఆర్‌ ప్రభుత్వం ప్రమోట్‌ చేసింది. వరంగల్‌ ఎంజీఏం ఆసుపత్రిని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోందని..అందుకు వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలాన్ని వినియోగించుకోవాలని అనుకుంటోందని..అందుకే జైలును కూల్చేసినట్లు ప్రభుత్వ వర్గాలు అప్పట్లో డీఎంఈ రమేశ్‌ రెడ్డి ద్వారా చెప్పించాయి. జైలును తాకట్టు పెట్టడడం ద్వారా వచ్చిన డబ్బులను ఆసుపత్రి విస్తర్ణ,డెవలప్‌ మెంట్‌ కోసం వాడనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు సంబంధించిన 56.39 ఎకరాల భూమిని రమేష్‌ రెడ్డి అధ్యక్షతన బ్యాంక్‌ మహారాష్ట్రకు తాకట్టు పెట్టేయడం గమనార్హం. ఇది ఒక రకంగా కేసీఆర్‌ ఫ్యామిలీకి లబ్ధి చేకూర్చేందుకే రమేశ్‌ రెడ్డి ఈ రకమైన పనికి పూనుకున్నారనే విమర్శలున్నాయి. అయితే ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఈ వ్యవహారంపై సీరియస్‌ గా ఫోకస్‌ పెట్టడడంతో డీఎంఈ రమేశ్‌ రెడ్డి తన బిస్తర్‌ సర్దే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈయన కూడా ప్రభాకర్‌ రావుల మాదిరే నైస్‌ గా విధుల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అయితే కొత్త ప్రభుత్వం ఈ అంశాన్ని ఎలా హ్యాండిల్‌ చేస్తుందోననే వ్యవహారంపై అటు డీఎంఈ..ఇటు వైద్య శాఖలో చర్చోపచర్చలు మొదలయ్యాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు