Tuesday, May 14, 2024

మహిళా బిల్లు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..?

తప్పక చదవండి

న్యూఢిల్లీ : మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చలో ఎస్‌పీ నేత డింపుల్ యాదవ్‌ మోదీ సర్కార్‌ను నిలదీశారు. మహిళా బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిరదని ఆరోపించారు. పదేండ్లుగా ఎన్నడూ లేనిది ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా మహిళలు ఎందుకు గుర్తుకువచ్చారని ఎస్‌పీ ఎంపీ డిరపుల్‌ యాదవ్‌ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే మోదీ సర్కార్‌కు మహిళలు గుర్తుకువచ్చారని ఎద్దేవా చేశారు. కాగా, మహిళా రిజర్వేషన్‌ బిల్లు అమలులో జాప్యాన్ని ఎత్తిచూపుతూ మోదీ సర్కార్‌కు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ పేర్కొన్నారు. 2010లో కాంగ్రెస్‌ తీసుకువచ్చిన మహిళా బిల్లు తక్షణ అమలుకు ఉద్దేశించినదయితే, 2023 మహిళా బిల్లు జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం అమలుకు నోచుకుంటుందని ఇరు బిల్లులను పోల్చుతూ జైరాం రమేష్‌ వ్యాఖ్యానించారు. 2010 మహిళా బిల్లు ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేసేందుకు ముందుకు తీసుకువచ్చామని వివరించారు.అయితే 2023 బిల్లును జనగణన, డీలిమిటేషన్‌కు ముడిపెడుతూ అమలులో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా బిల్లులో నియోజకవర్గాల పునర్విభజనను ముడిపెట్టడంతో ఈ ప్రక్రియ క్లిష్టంగా మారిందని జైరాం రమేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే జనగణన, డీలిమిటేషన్‌ను చేపడతారా అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు