Friday, May 3, 2024

రేవంత్ సర్కార్ కు అప్పుల సవాల్

తప్పక చదవండి
  • గత ప్రభుత్వ అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
  • కేసీఆర్‌ ప్రభుత్వంలో అధిక ధరలతో అల్లాడిన ప్రజలు
  • ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో లెక్క తేల్చాలి
  • చెప్పా పెట్టకుండా పారిపోతున్న అవినీతి అధికారులు
  • లెక్కలు తేల్చకుంటే నిందలు మోపె ఆస్కారం
  • 2014లో 15 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం
  • 2023లో ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ
  • ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్‌ అండ్‌ కో కుట్రలు
  • మాజీ మంత్రుల కార్యాలయాల్లో మాయమైతున్న ఫైల్లు, ఫర్నిచర్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : గత కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ఏ శాఖలో ఎంత మేరకు పనులు నిర్వహించారో, ఆయా శాఖల పేరు మీద ఎంత అప్పు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా ప్రజలు పన్ను రూపంలో కట్టే డబ్బు. వాటికి ప్రతినిధులుగా ఉన్నవారు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెచ్చిన రుణం ఎంత ఖర్చు చేసారో.. ప్రజలకు చెప్పరా.. ఆ అప్పులకు జవాబు దారితనం ఎవరిది. ఇవన్నీ కూడా శ్వేత పత్రం ద్వారా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేని స్థితికి గత ప్రభుత్వం తీకువచ్చింది..
రాష్ట్రం ఏర్పడినప్పుడు పదిహేను వేల కోట్ల మిగులు బడ్జెట్‌
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వానికి 15 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలలో సుమారు ఐదున్నర లక్షల కోట్ల అప్పుల్లో కి తీసుకెళ్లి తెలంగాణ ప్రజలను నిండా ముంచింది. ఉచిత పథకాల పేరుతో కాలేశ్వరం, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ లాంటి కమిషన్‌ పథకాలను కొనసాగించి ప్రజల నెత్తిన పెద్ద శటగోపం పెట్టారు. సమయం కోసం ఎదురుచూసిన ప్రజలు తప్పనిసరి అయి కేసీఆర్‌ ను గద్దె దించారు. ప్రజలను బర్రెలు, గొర్రెలు, చేపల పేరుతో బక్రాలను చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పైన గుదిబండను మోపారు.
కేసీఆర్‌ ప్రభుత్వంలో అధిక ధరలతో అల్లాడిన ప్రజలు
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలపై పెను భారం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా నిత్యవసర సరుకులతో పాటు, పెట్రోల్‌ డీజిల్‌, మద్యం, విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, పోలీస్‌ చలాన్లు, రవాణా శాఖ చాలన్లు, టెక్స్టైల్స్‌ వాహనాల కొనుగోలులో తీసుకున్న వాట్‌ జీఎస్టీ లాంటి అనేకమైన బారాలను మోపి ప్రజలను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీశారు. మీది కేమో మాది ప్రజల ప్రభుత్వం, మాది రైతు రాజ్యం అంటూ గొప్పలు చెబుతూ ప్రజలను ఒక మాయా ప్రపంచంలో వివరింపజేస్తూ నిలువునా దోచుకున్నారు. ప్రజలకు కేసీఆర్‌ ఆయన ప్రభుత్వం చేసిన అన్యాయాలు ఒకటొకటి బయటికి వచ్చి నిరూపితం అవుతున్నాయి. ఇక్కడ చూసిన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇంతగా మోసపోయామా మనము అనుకుంటూ ఆవేదన చెందుతున్నారు.
కేసీఆర్‌ అప్పులు.. రేవంత్‌ ప్రభుత్వానికి పెను సవాళ్లు
కేసీఆర్‌ చేసినటువంటి అప్పులు రేవంత్‌ ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారనున్నాయా అంటే, ప్రజల నుండి అవుననే మనమే సమాధానం వస్తుంది. కేసీఆర్‌ చేసిన పెంటనంత కడగాలంటే ఎంతో వేయప్రయాసలకు ఓర్చుకోవాల్సిందే అంటున్నారు. రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిన కేసీఆర్‌ సైన్యాన్ని ఊరికే వదలొద్దు.. వారు చేసిన తప్పులకు వారిని బాధ్యులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు మేధావులు. ఏ శాఖలో ఎంత అప్పు ఉందో.. ఎంత ఖర్చు చేశారు ఎంత అవినీతి జరిగింది లాంటి లెక్కలను బయటికి తీయాల్సిందే. అలా చేస్తేనే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు ప్రజలు ఓటు వేసి గెలిపించుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి న్యాయం దక్కుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక అటెండర్‌ స్థాయి మొదలుకొని ఐఏఎస్‌ స్థాయి వరకు అవినీతి మరకలు అంటుకున్నాయి అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అవినీతి అధికారులకు ఇప్పుడు రేవంత్‌ ఫీవర్‌ పట్టుకుంది. కొంతమంది అధికారులు చెప్పా పెట్టకుండా రాజీనామాలు చేసి పారిపోతున్నారు. వారి రాజీనామాలు ఆమోదించకుండా వారందరినీ తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానిదే అని అంటున్నారు. ప్రజల అనుమానాలను ఆరోపణలను నిజమా కావా అనే కోణంలో ప్రతి శాఖ పైన విడివిడిగా విచారణ జరిపించి నిగ్గు తేల్చాల్సిన అవసరం నూతన ప్రభుత్వం పై ఉన్నది. ప్రజల సవాల్‌ ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎలా స్వీకరిస్తాడు అనేది వేచి చూడాలి.
లెక్కలు తేల్చకుంటే.. నిందలు తప్పవు
గత ప్రభుత్వం చేసిన అప్పులు, ఆంధాని లెక్కలు తేల్చకుంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పైన నిందలు మోపి ప్రభుత్వాన్ని బద్దం చేసే కుట్రలకు కేసీఆర్‌ అండ్‌ కో తెర లేపుతారు. ప్రజల సొమ్మును ఇష్టానుసారంగా పప్పు బెల్లాల లాగా పంచుకున్న కేసీఆర్‌ ఆయన కో టీం దగ్గర నుండి కక్కించాల్సిన బాధ్యత రేవంత్‌ రెడ్డి సైన్యాన్నిది. సమయం ఇస్తే బమ్మిని తిమ్మిని చేసే కేసీఆర్‌ తన మెదడుకు పదును పెడతాడు. కానీ ఆ సమయం అతనికి ఇవ్వకుండా, ఇప్పుడే వీటన్నింటిపై లెక్కలు తేల్చి, ఒక్కొక్కరిని ప్రజల ముందు నిలబెట్టాలని తెలంగాణ ప్రజానీకం ఆశిస్తున్నారు. అయ్యో పాపం పోనీలే అని సానుభూతి చూపిస్తే నెత్తినెక్కికూర్చుంటాడు తస్మాత్‌ జాగ్రత్త అంటూ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించాలంటే మొదటగా చేయాల్సింది గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై లెక్కలు బయటకు తీయాల్సిందే. అలా చేస్తేనే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్న సామాజిక తెలంగాణ పునర్నిర్మాణం అవుతుంది.
మంత్రుల కార్యాలయంలో మాయమైతున్న ఫైల్స్‌ ఫర్నిచర్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మాజీ మంత్రుల కార్యాలయాల్లో ఫైళ్లు కాలిపోవడం, మాయమవడం, దొంగలు పడడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ఆ కార్యాలయాల ఓఎస్డీల కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. టూరిజం శాఖ కార్యాలయంలో ఫైల్‌ దగ్ధమవడం, మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు ఫర్నిచర్‌ ని ఎత్తుకెళ్లడం, పశ్చిమవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కార్యాలయంలో ఓ ఎస్‌ డి ఫైళ్లు మాయం చేయడం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇలా చూస్తే కెసిఆర్‌ ప్రభుత్వంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే సందేహాలు ప్రజలు కలుగుతున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు