Monday, April 29, 2024

ఇక ఆదాయం రాని డీసీసీబీలు మూత

తప్పక చదవండి

ముంబై : కేంద్ర బ్యాంకు అనుమతి అవసరం లేకుండానే.. పెద్దగా ఆదా యంరాని తమ శాఖలను మూసివేయడానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం ఆమోదముద్ర వేసింది. అయితే అందుకు సంబంధిత రాష్టాన్రికి చెందిన రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ నుంచి ఆమోదం ఉండాలని పేర్కొంది. శాఖల మూత నిర్ణయానికి ముందు సంబంధిత అన్ని అంశాలను పరిశీలించాలని, బోర్డు సమావేశ వివ రాలను సరైన పద్ధతిలో రికార్డు చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ‘అందరు డిపాజిటర్లు క్లయింట్లకు రెండు నెలల ముందుగానే నోటీసులు ఇవ్వడంతో పాటు.. ప్రముఖ స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని’ స్పష్టం చేసింది. అదే సమయంలో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయం నుంచి సదరు మూతపడ్డ శాఖ పొందిన ఒరిజినల్‌ లైసెన్సును డీసీసీబీ తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఆర్‌బీఐ ఏవైనా ఆంక్షలు విధించిన పక్షంలో.. శాఖల మూసివేతకు డీసీసీబీలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. సహకార బ్యాంకుల పేరు మార్పునకు పాటించాల్సిన నిబంధనలను మరో సర్క్యులర్‌లో ఆర్‌బీఐ తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు