Saturday, May 18, 2024

ధరణి పేరుతో అసైన్డ్‌ భూముల దంద

తప్పక చదవండి
  • ‘‘ప్రజా ఆశీర్వాద సభ’’ లో కేసిఆర్‌ మాటలు పచ్చి అబద్ధాలు
  • కేసీఆర్‌కు మంత్రి పదవి దక్కక పోవడంతో తెలంగాణ వాదం ఎత్తుకున్నారు
  • మీడియా సమావేశంలో మాట్లాడిన కొదండరెడ్డి , మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం : కేసిఆర్‌ ప్రభుత్వం ధరణి పేరుతో అసైన్డ్‌ భూముల దంద కొనసాగిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ కిసాన్‌ సెల్‌ జాతీయ ఉపాధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే కొదండ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంచాల మండలం జాపాల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండ రెడ్డి, మల్‌ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం లో నిర్వహించిన ‘‘ప్రజా ఆశీర్వధా సభ’’ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్పడం హేయమైన చర్య అని విమర్శించారు. కాంగ్రెస్‌ దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిందనీ, తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రి పదవి దక్కక పోవడంతో కేసీఆర్‌ తెలంగాణ వాదాన్ని తీసుకొని ఉద్యమాన్ని మొదలెట్టారనీ అన్నారు. ఇందిరా గాంధీ హయాంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గా సమయంలో అనేక కంపనీ లు ఏర్పాటు చేసి అభివృద్ధి ఆజ్యం పోశామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందనీ గుర్తు చేశారు. దేవాలయ భూములను కాజేసి విదేశీ కంపెనీలకు కోట్లా రూపాయాలకు భూములను అమ్ముకొని కోట్లు కొల్లగొట్టాడనీ ఆరోపించారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో రైతులకు ఉచిత కరెంట్‌ అందించామని అన్నారు. భూదాన్‌ భూములను 250 ఎకరాల భూములను, రూ. 65 కోట్ల బినామిల పేర్లతో కొల్లగొట్టారన్నారు. రంగపూర్‌ లోనీ నక్షత్రా ప్రయోగ శాలను ఏర్పాటు చేయమని చెప్పమని కానీ నేటికీ అతీగతీ లేదని చెప్పారు. యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో దేవాలయాన్ని ఆద్యాత్మిక దేవాలయంగా ఏర్పాటు చేయమని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ఇబ్రహీంపట్నం డిపో పక్కన గల భూములను అన్యాయం గా లాక్కొని రూ. వందల కోట్లు ఎమ్మెల్యే కొల్లగొట్టారన్నారు. ఇబ్రహీంపట్నం లో ఎమ్మెల్యే గా విజయం సాధించిన వెంటనే ముచ్చర్ల పార్మసిటీ పేరుతో ఎమ్మెల్యే చేసిన రూ. 65 కోట్ల అవకతవకలును వెలికితీస్తామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమ ఫలితంగానే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కొంగర కాలన్‌ ఏర్పాటు చేసారన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల కాలంగా చేసింది తక్కువ కానీ తన ఆస్తులు పెంచుకొని ఎక్కువ అన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు