- 24 గంటల కరెంట్ కావాలా మూడు గంటల కరెంట్ కావాలా?
- రైతుల రాజ్యం కావాలా? దళారుల రాజ్యం కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలి
- ఖానాపూర్ ను సుందరంగా తీర్చి దిద్దుతాం..
- రెవెన్యూ డివిజన్, ఆర్టీవో ఆఫీస్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది!
- బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్
ఖానాపూర్ : ఖానాపూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని ఎమ్మెల్యే అభ్యర్థి భుఖ్య జాన్సన్ నాయక్ అన్నారు. బుధవారం సాయంత్రం ఎనిమిదవ వార్డులో మాజీ ఎంపిటిసి జమీల్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జాన్సన్ నాయక్ సమక్షంలో వారి అనుచర వర్గంతో సహా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన వైఖరి వల్ల వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 9 ఏళ్లలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన ఘనత కేసీఆర్ ది అన్నారు. అటు అభివృద్ధితోపాటు సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అని అన్నారు. రైతులను రాజు చేసిన ఘనత కేసిఆర్ ది అని గత ప్రభుత్వ పాలనలో కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని సామాన్య ప్రజల శ్రేయస్సు,సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం బీఆర్‌ఎస్ అని అన్నారు. ప్రతిపక్ష బూటకపు మాటల వలలో పడకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ఖానాపూర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని గెలిచిన వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఆర్టీవో ఆఫీస్, రెవెన్యూ డివిజన్, తీసుకొచ్చే బాధ్యత తనదని అన్నారు. ప్రతి వార్డులో ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తూ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత పాలకులు ఖానాపూర్ కు వచ్చి దోచుకున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకునే దాఖలాలూ లేవనీ మీ ఆశీర్వాదంతో గెలిపిస్తే ఖానాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో జిల్లాలో మొదటి స్థానంలో ఉంచే బాధ్యత తనదన్నారు. పట్టణంలో డబల్ బెడ్రూం రాని వాళ్లకు త్వరలో అర్హులైన లబ్ధిదారుల ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలించే రాష్ట్రాలలో గ్యారంటీ పథకాలు హామీలకే పరిమితం అయ్యాయని ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మోసపూరిత హామీలను ప్రజలు నమ్మవద్దు అని అన్నారు. ఇటువంటి వారికి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, పట్టణ కౌన్సిలర్స్ కావలి సంతోష్, పరిమి సురేష్, కారింగుల సుమన్, మాజీ జెడ్పిటిసి రాము నాయక్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మైనారిటీ మండల అధ్యక్షుడు శడ్జిల్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ శోయెబ్ రాజగంగన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సక్కారం శ్రీనివాస్, గొర్రె గంగాధర్,నేరెళ్ల సత్యనారాయణ, సిరిగారపు లింగన్న, వెంకటప్పయ్య, మైనార్టీ నాయకులు ఇర్ఫాన్ దానిష్, కే హెచ్ ఖాజా, అబ్బు భాయ్, మెహ్రాజ్,నసీర్, ఫైసల్ , వాసే ఖాన్,తదితరులు పాల్గొన్నారు.