Tuesday, April 30, 2024

బంగ్లాదేశ్‌లో తీరం దాటిన తుపాను

తప్పక చదవండి

విశాఖపట్నం : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శుక్రవారం తుపానుగా బలపడింది. శుక్రవారం రాత్రి బంగ్లాదేశ్‌ తీరంలో ఖేపుపరాకు సమీపంలో తుపాను తీరం దాటిందని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. శనివారానికి ఈ తుపాను బలహీనపడుతుందన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కి.మీల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. దక్షిణ అండమాన్‌ వద్ద సముద్రం లో మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే అయిదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు