Sunday, May 5, 2024

కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది

తప్పక చదవండి
  • కేసీఆర్‌ను భయపెట్టే వ్యక్తి కావాలా.. భయపడే వ్యక్తి కావాలా..
  • చౌటుప్పల్‌లో డిగ్రీ కాలేజ్‌ ఏర్పాటు చేస్తా..
  • చౌటుప్పల్‌ కార్నర్‌ మీటింగ్‌లో రాజగోపాల్‌రెడ్డి..

చౌటుప్పల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కౌంటర్‌ డౌన్‌ స్టార్ట్‌ అయిందని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ చిన్న కొండూరు రోడ్డులో స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్లో మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌ రెడ్డి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రాజగోపాల్‌ రెడ్డికి మున్సిపల్‌ చైర్మన్‌ ఘన స్వాగతం పలికారు.మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌ మున్సిపాలిటీ లో మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..మీ ఉత్సాహం చూస్తుంటే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి డిపాజిట్‌ డౌటే అని అన్నారు.తెలంగాణలో అందరి నాయకులతో మాట్లాడుతు న్నాను.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలంగాణలో కాంగ్రెస్‌ జెండాను ఎగరేసి కెసిఆర్‌ ని ఫామ్‌ హౌస్‌ కి, కేటీఆర్‌ ని అమెరికాకు, కవితని జైలుకు పంపిద్దాం అని అన్నారు.రాబోయే కాలంలో కవిత తీహార్‌ సెంట్రల్‌ జైల్లో బతుకమ్మ ఆడుతుందని ఎద్దేవా చేశారు.10 సంవత్సరాలలో కెసిఆర్‌ కుటుంబం లక్షల కోట్లు దోచుకుందని, డిసెంబర్‌ 3 తారీఖున చెయ్యి గుర్తుతో బాక్స్‌ బద్దలు అవ్వాల్సిందేనని ధీమా వ్యక్తం చేశారు.ఈ రెండు రోజులు ప్రతీ కార్యకర్త కష్టపడి పేదల రాజ్యం పేదల ప్రభుత్వం చెయ్యి గుర్తుపైన ఓటేసి గెలిపించాలి కోరారు.ఉప ఎన్నికలో వంద మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ యంత్రాంగం పోలీసు యంత్రాంగం వస్తే చావు తప్పి కన్నులొట్టపై పట్టుమని పదివేల ఓట్ల మెజారిటీ కూడా రాలేదని ఆయన అన్నారు.ఈరోజు నా గెలుపును ఆపుతాడా కేసీఆర్‌,తానపదవి రాజీనామాతో మీ కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మునుగోడుకు పేరు తీసుకొచ్చినని అన్నారు. హైదరాబాద్‌ నగరం ఎలా ఉందో.. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కూడా అలా అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు.కేసిఆర్‌ ను భయపెట్టే వ్యక్తి కావాలా, కేసిఆర్‌ కు భయపడే వ్యక్తి కావాలా.. ఆలోచించండి అన్నారు.మునుగోడు లో నేను చేసిన యుద్ధం భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదని ఆయన అన్నారు.త్వరలోనే చౌటుప్పల్‌ పట్టణానికి గవర్నమెంట్‌ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని కోరారు.ఈ కూసుకుంట్ల ని,,కల్వకుంట్లని మన నాగులకుంటలో పడేద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్‌ నేత, మున్సిపల్‌ అధ్యక్షులు సుర్వి నరసింహా గౌడ్‌, సిపిఐ మండల అధ్యక్షులు పల్లే శేఖర్‌ రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఎండి హన్నుబాయ్‌, కౌన్సిలర్లు కామిశెట్టి శైలజ, కొయ్యడ సైదులు గౌడ్‌, సందగళ్ళ విజయ సతీష్‌ గౌడ్‌, ఉబ్బు వరమ్మ వెంకట య్య, పోలోజు వనజఅనిల్‌ కుమార్‌, అంతటి విజయలక్ష్మి బాల రాజు తదితర కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు