Saturday, May 18, 2024

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలి

తప్పక చదవండి
  • కేసిఆర్‌ కుటుంబ పాలన నుంచి విముక్తం కావాలి
  • తెలంగాణ గ్యారెంటీ పథకాలతో ప్రజలకు మేలు
  • జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాపరెడ్డి వెల్లడి

జనగామ : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించాలని, భారీ మెజార్టీతో గెలిపించి కేసిఆర్‌కు, బిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పాలని జనగామ కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో బీఆర్‌ఎస్‌ విఫలమైందన్నారు. అభివృద్ది చేశామని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నిలదీయాలన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ హాయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల హవిూలు విస్మరించారన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డులు ప్రజలలోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు విసిగెత్తి ఉన్నారని ఆ పార్టీకి చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలిని కోరారు. పార్టీ ఆధ్వర్యంలో ఆయన పలు గ్రామాల కార్యాకర్తలతో ప్రచారంపై చర్చించారు. గ్రామాలకు వెళ్లి రాహుల్‌ సందేశాన్ని వినిపించాలని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనతో విసుగెత్తి ఉన్నారని, ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ పాలనను కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య పోరు జరగబోతుందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటన నూటికి నూరుపాళ్లు నిజమని అన్నారు. కచ్చితంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రాబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో భూముల్ని లాగేసుకునే కుట్ర జరుగుతోందని, ధరణితో లాభం జరిగింది కేవలం కల్వకుంట్ల కుటుంబానికేనని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ధరణిని ఎత్తేయడం ఖాయమని అన్నారు. ప్రభుత్వ సంస్థలు అన్ని నిర్వీర్యం చేశారని, దోపిడీకి రాజమార్గం ఎంచుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దోపిడీ అయిపోయిందని, ఇప్పుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి దోపిడీకి సిద్దం అయ్యారని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకుంటు న్న బిఆర్‌ఎస్‌ ను ఓడిరచి బుద్ది చెప్పాలన్నారు. రైతు భరోసా అనే కార్యక్రమంతో కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వస్తోందని, రూ.15 వేలు ప్రతి ఏడాదికి, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల రూపాయలు ఇస్తాం. గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు కరెంటు కాల్చే కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. చేయూత పథకం కింద పింఛన్లు రూ.4 వేలు చేయబోతున్నాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్యబీమా కల్పిస్తామన్నారు. ప్రజలకు ఇవన్నీ వివరించి వారి ఓట్లను అడుగుతున్నామని ప్రతాపరెడ్డి అన్నారు. బీజేపీకి ఓటేసినా పరోక్షంగా బీఆర్‌ఎస్‌కి ఓటేసినట్లేనని అన్నారు.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ను పడగొట్టడమే కాకుండా, 2024లో బీజేపీని రానివ్వకుండా అడ్డుకుంటామని అన్నారు. తెలంగాణ కోసం మనమంతా పోరాడితే, సోనియా గాంధీ చారిత్రక నిర్ణయం తీసుకొని రాష్టాన్న్రి ఇచ్చారరని, చివరకు అది కెసిఆర్‌ కుటుంబ బందీగా మారిందని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు