Saturday, May 11, 2024

కెేసిఆర్‌ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు`కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

తప్పక చదవండి
  • రాష్ట్రంలో కుటుంబ పాలన అంతం కావాలి, ప్రజాస్వామ్యం నిలబడాలి.
  • రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టే.
  • అమ్మవారికి పూజలు నిర్వహించి, విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాజగోపాల్‌ రెడ్డి.

చౌటుప్పల్‌ : కెేసిఆర్‌ను గద్దె దించే వర కు తన పోరాటం ఆగదని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరె డ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఆదివారం తన సొంత గూటికి చేరుకున్న సందర్భంగా శ్రీ ఆందోల్‌ మైసమ్మ దేవాలయం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్‌ కుటుంబానికి వ్యతిరేకంగానే బిజెపి పార్టీలో మారానని, మళ్లీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీ లోకి వచ్చిన ,లక్ష్యం ఒకటేనని తెలంగాణలో కుటుంబపాలన అంతమై ప్రజాస్వామ్యం నిలబడా లని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక కుటుంబం కోసమే రాలేదని, బడుగు, బలహీన వర్గాల కోసమే వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీసుకొని ప్రశ్నించే గొంతు లేకుండా చేసిండో, ఆ రోజునే తన పోరాటం ప్రారంభమైందని తెలిపారు.

తెలంగాణ మొత్తం ప్రజలు కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ అంటూందని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకొని సోనియాగాంధీ రుణం తీర్చుకోడానికి అవకాశం వచ్చిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీలో మంచి గౌరవం ఇచ్చి, పదవులు ఇచ్చినా సరే, తెలంగాణ సమాజం కోసం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు. కెసిఆర్‌ కుటుంబ పాలన అంతం కావడం కోసం ఒక అడుగు వెనుకకు వేసి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖార్గే నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. తన మీద నమ్మకంతో మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని తెలిపారు. మునుగోడు ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మునుగోడు క్యాంప్‌ ఆఫీస్‌ లో ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌ రెడ్డి, జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, కౌన్సిలర్లు కొయ్యడ సైదులు గౌడ్‌, ఉబ్బు వరమ్మ వెంకటయ్య, అంతటి విజయలక్ష్మి బాలరాజు, కైతాపురం సర్పంచ్‌ గుడ్డేటి యాదయ్య, ఎంపీటీసీలు బద్దం కొండల్‌ రెడ్డి, సుర్వి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మన్నె నరసింహారెడ్డి, మోగుదాల రమేష్‌ గౌడ్‌, పెద్దగోని రమేష్‌ తదితర కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు