Friday, October 11, 2024
spot_img

టీఆర్‌ఎస్‌కు బై బై..! కాంగ్రెస్‌కు జై జై !!

తప్పక చదవండి
  • మంచిరెడ్డికి గడ్డుకాలం.. మల్‌ రెడ్డికి మంచి కాలం!
  • పెద్ద అంబర్పేట్‌ మున్సిపల్‌ బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడి రాజీనామా
  • ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టి షాక్‌
  • కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిద్దంకి కృష్ణారెడ్డి
  • ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి నాయకుల చేరికలతో జోరు మీద ఉన్న హస్తం పార్టీ

అబ్దుల్లాపూర్మెట్‌ : రాష్ట్రంలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా ఇబ్రహీం పట్నం నియోజకవర్గం ఫలితానికై రాష్ట్రవ్యాప్తంగా ఉత్సుకథ ఉండడం విశేషం. గత ఎన్నికల లో పోటాపోటీగా నిలిచిన అభ్యర్థులు, ఈసారి చావోరేవో తేల్చుకునేం దుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీకి అబ్దుల్లాపూర్మెట్‌ మండలంలో పెద్దదిక్కుగా ఉంటూ పెద్ద అంబర్పేట్‌ మున్సిపల్‌ అధ్యక్షు డిగా బాధ్యతలు నిర్వహిస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉండి టిఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి మృదుస్వభావి, సౌమ్యుడిగా, అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అకస్మాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పెద్ద అంబర్‌ పేట మున్సిపాలిటీ బిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ సిద్ధంకి కృష్ణారెడ్డీ తన అనుచర వర్గంతో కలిసి బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మల్‌ రెడ్డి రంగారెడ్డి, సిడబ్ల్యూసి మెంబర్‌, ఏఐసిసి ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ చల్ల వంశీచందర్‌ రెడ్డిలు సిద్దంకి కి పార్టీ కండువా కప్పి కృష్ణారెడ్డిని పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధంకి పార్టీలో చేరడంతో మెట్టు మండలంలో కాంగ్రెస్‌ పార్టీకి బలం పెరిగిం దని అన్నారు. పురపాలక సంఘం పరిధిలో కాంగ్రెస్‌ మెజారిటీకి కృషి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులతోపాటు ప్రజాప్రతినిధులు, పెద్ద అంబర్‌ పేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు, సీనియర్‌ నాయకులు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, సిద్ధంకి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు