Sunday, April 28, 2024

నాలుగు స్థానాల్లో అభ్యర్థులను మార్చిన కాంగ్రెస్..

తప్పక చదవండి
  • సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం..

భోపాల్ : టికెట్ల పంపకాలతో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన అభ్యర్థులను కాదని మరొకరిని అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది కాంగ్రెస్ పార్టీ. సుమావలి, పాపిరియా, బాద్‌నగర్‌, జావ్రా స్థానాల అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ మార్పులు చేసింది. సుమావాలి నుంచి కుల్దీప్ సికర్వార్ స్థానంలో అజబ్ సింగ్ కుష్వాహా, పిపారియా నుంచి గురు చరణ్ ఖరే స్థానంలో వీరేంద్ర బెల్వాన్షి, బాద్‌నగర్ నుంచి రాజేంద్ర సింగ్ సోలంకి స్థానంలో మురళీ మోర్వాల్, జవ్రా నుంచి హిమ్మత్ శ్రీమల్ స్థానంలో వీరేంద్ర సింగ్ సోలంకీలను కాంగ్రెస్ నామినేట్ చేసింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత అంతర్మథనంలో పడింది కాంగ్రెస్. టికెట్ల పంపకాలు జరిగాయో లేదు కాంగ్రెస్‌కు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల పోటీదారులు నిరంతరం సీనియర్ నేతలను కలుస్తూ టిక్కెట్టు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల్లోకి నేతలు మారుతూ టికెట్లు సంపాదిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అయా నియోజకవర్గాల్లో గెలుపోటమలుపై ప్రభావం చూపుతుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులను మార్చినట్లు నాలుగు స్థానాలపై నిర్ణయం వెలువడింది.

- Advertisement -

గతంలో ముగ్గురు అభ్యర్థులను మార్చారు. మూడో జాబితాలో మార్పులు చేస్తూ, కమల్‌నాథ్ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న నర్మదా ప్రసాద్ ప్రజాపతిని, నర్సింగపూర్ జిల్లాలో షెడ్యూల్డ్ కులానికి రిజర్వ్ చేసిన గోటేగావ్ స్థానం నుండి రాజేంద్ర భారతిని దాతియా నుండి హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, పిచోర్ నుండి కాంగ్రెస్ పోటీకి దింపింది. శైలేంద్ర సింగ్ స్థానంలో అరవింద్ సింగ్.. లోధీకి టిక్కెట్టు ఇచ్చారు. ఈసారి ఎలాగైనా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో మాజీ సీఎం కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తుంది. చివరికి మధ్య ప్రదేశ్ ఓటర్లు ఎవరిని ఆశీర్వదీస్తారో వేచి చూడాలి..!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు