Monday, April 29, 2024

అసెంబ్లీలో 42 పేజీల శ్వేతపత్రం విడుదల చేసిన ప్రభుత్వం..

తప్పక చదవండి
  • రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేవన్న డిప్యూటీ సీఎం
  • వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియాల్సి ఉందని వ్యాఖ్య

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంఐఎం ఫ్లోర్ లీడర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఫ్లోర్ లీడర్ గా కూనంనేని సాంబశివరావు పేర్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అనంతరం తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఎన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అయితే కన్న కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, కలలను నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ శ్వేతపత్రంపై సభలో ఉన్న ప్రతి సభ్యుడు సూచనలు చేయాలని కోరుతున్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం కంటే ముందే బీఆర్ఎస్ డాక్యుమెంట్ విడుదల చేసింది. శాఖల వారీగా ఆస్తులు, అభివృద్ధి, ఆదాయం వివరాలను ప్రకటించింది. పదేళ్లలో 137 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ సంస్థల ఆస్తులు రూ.1,37,51 కోట్లు. విద్యుత్ సంస్థల అప్పులు రూ.81వేల కోట్లుగా పేర్కొంది. విద్యుత్ సంస్థల అప్పులు 2014లో రూ.22,423 కోట్లు ఉండగా, 2023 నాటికి రూ.81 వేల కోట్లుగా ఉంది. విద్యుత్ సంస్థల ఆస్తులు 2014లో రూ.44,431 కోట్లు ఉండగా, 2023 నాటికి రూ.3,37,571 కోట్లుగా ఉంది. మొత్తం అప్పుల్లో పెరుగుదల రూ.59 వేల కోట్లుగా ఉంది. మొత్తం ఆస్తుల పెరుగుదల రూ.93 వేల కోట్లుగా ఉంది. రాష్ట్రంలో జిల్లాలు 33కు పెంచారు. 30 జిల్లాల్లో రూ.1649.62 కోట్ల వ్యయంతో జిల్లా కలెక్టర్ భవనాలు నిర్మించారు. వీటిలో 25 భవనాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 2014 తర్వాత రూ.3.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. 22.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 334 చిన్న పరిశ్రమల పునరుద్ధరణ జరిగింది. 10.400 ఎకరాల్లో అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ఏర్పాటు అయింది. 10822 కోట్ల రూపాయల ఖర్చుతో 283.71 కోట్ల మొక్కలు నాటారు. దాని ఫలితం విలువ రూ.211 లక్షల కోట్లు.

శ్వేత పత్రంలోని ముఖ్యంశాలు..

- Advertisement -

తెలంగాణ బడ్జెట్ కు వాస్తవ వ్యయానికి 20శాతం అంతరం ఉంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య భారీ తేడా ఉంది
2014- 15లో అప్పు 72,658 కోట్లు.. ప్రస్తుతం 6, 71, 757 కోట్లకు అప్పు పెరిగింది.
2014-15 నుంచి 2022 – 23 మధ్య కాలంలో సగటున 24.5శాతం అప్పు పెరిగింది.
2023- 24 అంచనా ప్రకారం రాష్ట్ర రుణం రూ.3,89,673 కోట్లు.
2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7శాతంతో దేశంలో అత్పల్పం.
57ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ.4.98లక్షల కోట్ల వ్యయం.
రాష్ట్రం ఏర్పడిన తరువాత 10 రెట్లు పెరిగిన రుణభారం.
ఈ పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదు
రుణాలకు వడ్డీ చెల్లింపుల భారం రెవెన్యూ రాబడిలో 34శాతానికి పెరిగింది
రెవెన్యూ రాబడిలో మరో 35శాతం ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్ళింది.
పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గింది. 2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేది. ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గింది
విద్య వైద్య రంగాలకు సరైన నిధులు ఖర్చు చేయలేకపోయింది.
రోజువారి ఖర్చులకు కూడా ఆర్బీఐపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది
2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది
బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి కారణం.
కాంగ్రెస్ హయాంలో ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాము
అందుకే ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశాం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు