- తండ్రి మరణానంతరం కారుణ్య నియామకంలో భాగంగా
అక్రమ మార్గంలో ఉద్యోగం పొందిన పీఎం ప్రసన్న లత.. - ప్రసన్న లత నియామకంపై ఫిర్యాదు చేసిన సామాజిక కార్యకర్త..
- ఐఏఎస్ స్థాయి అధికారితో విచారణ చేయించిన ఇంటర్ బోర్డు కమిషనర్..
- ఆమె తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిర్ధారణ..
- ప్రభుత్వ టీచర్ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యిన ఆమె తల్లి
- వివరాలను దాచిపెట్టి ప్రభుత్వాన్ని మోసం చేసిన వైనం..
- సస్పెండ్ చేసిన కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఐఏఎస్..
- సస్పెన్షన్ ఆర్డర్ ని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసిన
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కార్యదర్శి వాకాటి కరుణ ఐఏఎస్.. - ఈ వ్యవహారం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని
డిమాండ్ చేస్తున్న సామాజిక కార్యకర్త..
తండ్రి మరణానంతరం కారుణ్య నియామకం కింద వుద్యోగం సంపాదించింది ఆమె.. తప్పుడు వివరాలను అందించి ప్రభుత్వాన్ని మోసం చేసింది.. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారి ఆమెను సస్పెండ్ చేశారు.. కానీ అపురూపమైన కరుణను మనసంతా నింపుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కారదర్శి వాకాటి కరుణ తాను చేస్తున్నది తప్పు అని తెలిసినా లోపాయికారి ఒప్పొందంతో.. ఆ ఉద్యోగి సస్పెన్షన్ ఉత్తర్వులను నిలిపివేయాలని హుకుం జారీ చేసింది.. ఈమె వ్యవహారానికి మరో మహిళా అధికారి రీజనల్ జాయింట్ డైరెక్టర్ కూడా తమ వంతు సహకారం అందించారు.. ఈ వ్యవహారమంతా ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జరిగింది.. ఆ ఉద్యోగిని పేరు పీఎం ప్రసన్న లత.. ప్రస్తుతం ఆమె అడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు.. ఆ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్( ఆదాబ్ హైదరాబాద్ ) : ఆయన పేరు పీ. పీటర్ కమీషనర్ అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో సుపరిండేంట్ గా విధులు నిర్వహిస్తుండే వారు..
కాగా ఆయన 1992 మరణించారు.. తన తండ్రి చనిపోయిన తదనంతరం కారుణ్య నియమాకం కింద పిఎం ప్రసన్న లత 1993లో కమీషనర్ అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు చేపట్టడం జరిగింది..
అయితే ప్రసన్న లత నియామకం విరుద్ధమని ఓ సామజిక కార్యకర్త ఉన్నతాధికారులకు పిర్యాదు చేయడం జరిగింది. ఇదే విషయంపై అప్పటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమీషనర్ ఐఏఎస్ స్థాయి అధికారితో ఎంక్వరీ చేయించడం జరిగింది. ఎంక్వరీ అధికారులు సమగ్రంగా విచారించి, ప్రసన్న లత తండ్రి పీటర్, తల్లి సి. సౌభాగ్యం గురించిన పూర్తి వివరాలు సేకరించారు. దర్యాప్తు బృందం దృష్టికి వచ్చింది ఏమిటంటే పిఎం. ప్రసన్న లత ప్రస్తుత అడిషనల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తప్పుడు సమాచారం అందించి ప్రభుత్వ కారుణ్య నియామకాన్ని పొందండం జరిగింది. వారి తల్లి సి. సౌభాగ్యం హైదరాబాద్ లోని జమిస్తాన్పూర్ లోని, మోడరన్ ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా (ఎస్.జి.టి అపాయిన్మెంట్ తేదీ 01/08/1986) విధులు నిర్వర్తించి 30/06/2010 న రిటైర్డ్ అయ్యారు. కాగా సి. సౌభాగ్యం 01/03/2021 రికార్డుల ప్రకారం పెన్షన్ కూడా పొందుతున్నారు. కాగా కారుణ్య నియామకం అనేది కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులను ఆర్డీఓ స్థాయి అధికారి చేత ధ్రువీకరించిన అనంతరం ఉద్యోగ అవాకాశం కల్పిస్తారు. కానీ, అడిషనల్ డైరెక్టర్ ప్రసన్న లత ప్రభుత్వాన్ని మోసం చేసి తన తల్లి సి. సౌభాగ్యం ప్రభుత్వ ఉద్యోగురాలైనా.. ప్రభుత్వ ఉద్యోగస్తురాలు కాదన్నట్టు, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, ప్రభుత్వ నియమ, నిబంధనలను ఉల్లంఘించి.. ఎలాంటి అర్హత లేని అధికారితో తప్పుడు ఆర్థిక స్తొమత ధ్రువపత్రం పొంది ప్రభుత్వాన్ని మోసం చేసి కారుణ్య నియామకం పొందినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.
ఈ రిపోర్ట్ ఆధారంగా పిఎం ప్రసన్న లతను కమీషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఆర్.సి నెం ఎస్. సి ఆర్ -1-1/స్పెషల్ /2022 తేదీ 08/08/2022 నాడు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మెమో నెం 938/1ఈ/ఏ1/2022 – 1 తేదీ 08/08/2022 సస్పెన్షన్ ఆర్డర్ ని నిలిపివేయాలని (కేప్ట్ ఇన్ అబేయన్సు) అదే రోజు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.. ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేసి వారి ఇచ్చిన నివేదిక ప్రకారం, అదారాలను పరిశీలించిన అనంతరం కమీషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ 08/08/2022 తేదీన సస్పెండ్ చేస్తే ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ అడిషనల్ డైరెక్టర్ తో లోపాయకారి ఒప్పందం చేసుకొని.. ఈ మెమోను జారీ చేసారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పిఎం ప్రసన్న లత తన సస్పెండ్ ను ఉత్తర్వులను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది.
ఉన్నత న్యాయస్థానం స్టేటస్ కో ఆర్డర్ ను యదా స్థితిగ అమలు చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాగా 29/09/2022న కౌంటర్ దాఖలు చేయాలని మెమో నెంబర్ 1202/1ఈ.ఏ2/2022 ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. కమీషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ 01/09/2022 లో ప్రభుత్వ ప్లీడర్ కు అక్రమ నియామకంపై పూర్తి వివరాలని అందజేస్తూ సమాచారాన్ని అందిచడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం అనేక సార్లు త్వరతగతిన కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన, రిట్ పిటిషన్ నెం. 34516/2022 కమీషనర్ అఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రద కౌంటర్ వేయకుండా ఉద్దేశపూర్వకంగా తాత్పర్యం చేస్తున్నట్లు బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పిఎం ప్రసన్న లత ప్రభుత్వానికి కుటుంబాన్ని పోషించే వారు లేరని, తన తల్లి ప్రభుత్వ ఉద్యోగస్తురాలైనా.. తప్పుడు సమాచారం అందించి ప్రభుత్వాన్ని మోసం చేసి.. అక్రమంగా ఉద్యోగం పొందిన అడిషనల్ డైరెక్టర్ ప్రసన్న లతపై చర్యలు తీసుకోవాలని సామజిక కార్యకర్తలు కోరుతున్నారు. నాటి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ స్వార్థ ప్రయోజనాల కోసం సస్పెండ్ ఉత్తర్వులను నిలిపివేసి, విధి నిర్వహణ సక్రమంగా నిర్వహించినందుకు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెలిసుకెళ్లాలని, ఉద్దేశపూర్వకంగా కౌంటర్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన రీజనల్ జాయింట్ డైరెక్టర్ జయప్రదపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.